*ప్రపంచ శాంతి దూత మదర్ తెరిసా* : *ఘనంగా 116వ జయంతి వేడుకలు* *పీస్ సేవా సంఘం ఆధ్వర్యంలో 1,000 మందికి వస్త్రాలు, రగ్గుల పంపిణీ*
సేవే లక్ష్యం, ప్రేమే మార్గంగా జీవించిన విశ్వమాత మదర్ తెరిసా ప్రపంచ శాంతి దూత అని, భారతదేశంలో ఆమె అందించిన నిస్వార్థ సేవలు ఎనలేనివని పిటి స్కూల్ డైరెక్టర్ కేజీ కుమార్ కొనియాడారు. తూరంగిలోని పిటి క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్లో పీస్ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మండవ దైవ సమాధానం ఆధ్వర్యంలో మదర్ తెరిసా 116వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి టిఎన్‌టియుసి నాయకులు సబ్బతి ఫణీశ్వరరావు అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా కేజీ కుమార్, విశిష్ట అతిథులుగా క్రీస్తు సంఘం డైరెక్టర్లు టి.జ్ఞాన సుధీర్, రిక్కీ గూటం హాజరయ్యారు. తొలుత మదర్ తెరిసా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. మదర్ తెరిసా చూపిన శాంతి, సేవా మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమాజ సేవలో ముందుంటున్న పీస్ సేవా సంఘం వ్యవస్థాపకులు దైవ సమాధానంను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించి, సత్కరించారు.పీస్ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మండవ దైవ సమాధానం మాట్లాడుతూ.. గత 16 సంవత్సరాలుగా మదర్ తెరిసా ఆశయాలతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఏడాది దాదాపు 1,000 మంది పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు ఉచితంగా నూతన వస్త్రాలు, రగ్గులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండవ శ్యామ్ సన్, గుడిపాటి కిరణ్ కుమార్, కొల్లాబత్తుల బ్రహ్మస్వామి, దుగ్గన దొరబాబు, కుంచె బంగారుబాబు, గొల్లపల్లి సుబ్బారాయుడు, కాండ్రు రాజ్ కుమార్, గొల్లపల్లి సూర్యప్రకాష్, యర్రనీటి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
