బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా మదనపల్లె *70 ఏళ్ల వృద్ధురాలి కన్నీటి గోడు* -చీకట్లోనే బతుకీడుస్తూన్న దళిత వృద్దురాలు -ఇల్లు వదిలి పెట్టకపోతే చంపేస్తామని అధికార పార్టీ నేతలు వార్నింగ్ ఇవ్వడంతో కన్నీటి పర్వతం – అధికారం ఉపయోగించి కరెంటు తొలగించడంతో చీకట్లో కాలం వెలదీస్తున్న బాధితురాలు…. అన్నమయ్య జిల్లా మదనపల్లె వైఎస్సార్ కాలనీలో 15 ఏళ్లుగా ఉంటున్న 70 ఏళ్ల కొండమరి లక్ష్మమ్మ దయనీయ పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది. డోర్ నెం.AA-27-441లో పన్ను, కరెంట్ బిల్లు (5211700086086) కడుతూ నివసిస్తున్న ఆమె ఇంటిని కబ్జా చేసేందుకు కరెంట్ మీటర్ పీకేసి, జేసీబీతో కూలుస్తామని బెదిరిస్తున్నా రట. కలెక్టర్ ఎస్పీ స్థాయి అధికారులు స్పందించి వెంటనే బాధితురాలికి న్యాయం చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. వీడియోలో దీపం వెలుగులో ఆధార్, బిల్లు పత్రాలు పట్టుకుని చీకట్లో వణుకుతూ నిలబడిన లక్ష్మమ్మను చూస్తే మానవత్వమే సిగ్గుపడుతుంది. అధికారులు వెంటనే స్పందించి ఆ తల్లికి వెలుగు నింపాలి.

    Date:

    📰 Generate e-Paper Clip

    బ్రేకింగ్ న్యూస్

     

    అన్నమయ్య జిల్లా మదనపల్లె

     

    *70 ఏళ్ల వృద్ధురాలి కన్నీటి గోడు*

    -చీకట్లోనే బతుకీడుస్తూన్న దళిత వృద్దురాలు

    -ఇల్లు వదిలి పెట్టకపోతే చంపేస్తామని అధికార పార్టీ నేతలు వార్నింగ్ ఇవ్వడంతో కన్నీటి పర్వతం

    – అధికారం ఉపయోగించి కరెంటు తొలగించడంతో చీకట్లో కాలం వెలదీస్తున్న బాధితురాలు….

     

    అన్నమయ్య జిల్లా మదనపల్లె వైఎస్సార్ కాలనీలో 15 ఏళ్లుగా ఉంటున్న 70 ఏళ్ల కొండమరి లక్ష్మమ్మ దయనీయ పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది.

     

    డోర్ నెం.AA-27-441లో పన్ను, కరెంట్ బిల్లు (5211700086086) కడుతూ నివసిస్తున్న ఆమె ఇంటిని కబ్జా చేసేందుకు కరెంట్ మీటర్ పీకేసి, జేసీబీతో కూలుస్తామని బెదిరిస్తున్నా రట. కలెక్టర్ ఎస్పీ స్థాయి అధికారులు స్పందించి వెంటనే బాధితురాలికి న్యాయం చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.

     

     

    వీడియోలో దీపం వెలుగులో ఆధార్, బిల్లు పత్రాలు పట్టుకుని చీకట్లో వణుకుతూ నిలబడిన లక్ష్మమ్మను చూస్తే మానవత్వమే సిగ్గుపడుతుంది. అధికారులు వెంటనే స్పందించి ఆ తల్లికి వెలుగు నింపాలి.

    Previous article
    అమెరికాలో తెలుగు యువతి హత్య.. ఆగ్రాలో నిందితుడి అరెస్ట్.. అమెరికాలో సంచలనం సృష్టించిన హైదరాబాద్ యువతి నిఖిత గోదిశాల (27) హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్య కేసు నిందితుడు, ఆమె మాజీ రూమ్‌మేట్‌ అర్జున్ శర్మ (26)ను హైదరాబాద్ పోలీసులు ఆగ్రాలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించింది. ఈ హత్య కేసులో భాగంగా ఇప్పటికే నిందితుడిపై అమెరికా పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో ప్రస్తుతం అమెరికా అధికారులకు అర్జున్ శర్మను అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. హైదరాబాద్‌కు చెందిన నిఖిత గోదిశాల అమెరికాలోని మేరీల్యాండ్‌లోని ఎల్లికాట్ సిటీలో ఉద్యోగం చేస్తోంది. ఆమె కనిపించడం లేదంటూ జనవరి 2న ఫిర్యాదు అందడంతో హోవర్డ్ కౌంటీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేరీల్యాండ్‌లోని అర్జున్ శర్మ అపార్ట్‌మెంట్‌లో నిఖిత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో శర్మపై ఫస్ట్-డిగ్రీ, సెకండ్-డిగ్రీ హత్యారోపణలతో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో నిందితుడు భారత్‌కు పారిపోయి వచ్చాడు. మరోవైపు, డిసెంబర్ 31, 2025న నిఖిత హత్యకు గురైనట్లు బాధిత కుటుంబ సభ్యులకు భారత అధికారులు సమాచారం అందించారు. నిఖిత తండ్రి ఆనంద్ గోదిశాల ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తెలంగాణలోనూ అర్జున్‌పై మోసం కేసు నమోదైంది. నిఖిత నుంచి డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏప్రిల్‌లో కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో లభించిన ఆధారాలతో ఆగ్రాలో అర్జున్‌ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లి ఓ ఫ్లాట్‌లో అతడిని అదుపులోకి తీసుకుంది. అనంతరం హత్య కేసు దర్యాప్తులో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించారు. న్యూఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ఆగస్టు 25న హాజరుపరుచగా.. హత్యకు సంబంధించిన కేసులో రిమాండ్ విధించింది.
    Next article
    ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పశ్చిమ ఇబ్రహీంపట్నంలో నేషనల్ హైవే పక్కన ఉన్న ఒక బార్ అండ్ రెస్టారెంట్ వద్ద ఇరు గ్రూపుల మధ్య వివాదం…. బార్ మూసిన తర్వాత అమ్మకాలు జరగడం వల్లనే గొడవలు.. రాత్రి 12 గంటల తర్వాత గొడవ… బార్ బయట యువకుడిని బురద గుంటలో పడేసి కొట్టిన మరో గ్రూప్ సభ్యులు… గంజాయి ముఠా సభ్యులు ఈ దాడిలో పాల్గొన్నట్లు చర్చ… వెస్ట్ ఇబ్రహీంపట్నం కి చెందిన యువకుడుగా గుర్తించిన పోలీసులు గతంలో ఇదే బార్ అండ్ రెస్టారెంట్ వద్ద తుమ్మలపాలెం యువకుడినీ కొట్టిన హైదరాబాద్ యువకులు… తరచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసుల నిఘా పెంచాలని… అర్దరాత్రి మద్యం అమ్మకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!