తూర్పుగోదావరి డీపీఆర్ఓ
పెద్దింటి రవి పదవీ విరమణ ఆత్మీయ సమ్మేళనo
కాకినాడ, (జిఎస్ బి వార్త ప్రతినిధి )
- కాకినాడ జిల్లా లో సుదీర్ఘకాలం సేవలందించి తూర్పుగోదావరి జిల్లా పౌర సంబంధాల అధికారి డీపీఆర్వో గా పనిచేస్తు ఆగస్టు 31న పదవీ విరమణ చేయనున్న పెద్దింటి రవి పదవీ విరమణ ఆత్మీయ సమ్మేళన ఘనంగా నిర్వహించారు. ఆదివారం కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ ఎదురుగా హోటల్ బ్లూమ్ లో సమాచార పౌర సంబంధాల శాఖ జోన్-2 జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) టి. తిమ్మప్ప,కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారులు బి.పద్మజ, లక్ష్మీనారాయణ, సీనియర్ పాత్రికేయులు టి. మధుసూదన రావు, సమాచార శాఖ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) డి. నాగార్జున ముఖ్య అతిథులు గా పాల్గొన్నారు .ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పాత్రికేయ సోదరులు, సమాచార శాఖలో వివిధ జిల్లాల్లో పనిచేసిన విశ్రాంత ఉద్యోగులు, ప్రస్తుతం పని చేస్తున్న అధికారులు సిబ్బంది, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు హాజరై పెద్దింటి రవి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ జోన్ 2 ఆర్జేడీ తిమ్మప్ప మాట్లాడుతూ సమాచార పౌర సంబంధాల శాఖలో 39 సంవత్సరాల 6 నెలల సుదీర్ఘ కాలం పాటు పి.రవి వివిధ హోదాల్లో బాధ్యతాయుతంగా పనిచేస్తూ అందించిన విశేష సేవలను కొనియాడారు.
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు మీడియా సమన్వయం లో ఆయన చేసిన కృషి ఎంతో స్పూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ ఆత్మీయ సమ్మేళన వేడుకలో భాగంగా ఆర్జేడీ టి. తిమ్మప్ప ఇతర అతిథులు పెద్దింటి రవి దంపతులను శాలువా కప్పి, పూల బొకేతో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు. భవిష్యత్తులోను ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.తన ఉద్యోగ ప్రస్థానంలో అండగా నిలిచి ఆదరించి ప్రోత్సహించిన ఉన్నతాధికారులకు, సహాయ సహకారాలు అందించినసహోద్యోగులకు, మీడియా మిత్రులకు, కష్టసుఖాల్లో వెన్నంటి నిలిచిన కుటుంబ సభ్యులకు,బంధు మిత్రులకుశ్రేయోభిలాషులందరికీ పి. రవి తన కృతజ్ఞతలు తెలిపారు.
