ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం పీజీఆర్‌ఎస్‌లో ప్రజల వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు

    Date:

    📰 Generate e-Paper Clip

    ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

    పీజీఆర్‌ఎస్‌లో ప్రజల వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు

    మురమళ్ల: సెప్టెంబర్ 05 ( జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం నిర్వహించారు. మురమళ్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హాజరై తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో ఎమ్మెల్యేకు అందజేశారు.

    వ్యక్తిగత సమస్యలతో పాటు సామాజిక, మౌలిక వసతులకు సంబంధించిన పలు అంశాలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అర్జీదారుల సమస్యలను ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు శ్రద్ధగా విని, పరిష్కారానికి అవసరమైన చర్యలపై సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. తక్షణమే పరిష్కరించగల సమస్యలపై వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

    మిగిలిన సమస్యలను సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. మరికొన్ని సమస్యలను పీజీఆర్‌ఎస్‌ పోర్టల్‌లో నమోదు చేసి, వాటి పరిష్కారంపై నిరంతరం పర్యవేక్షించాలని కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

    ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, వారి సమస్యలకు సత్వర పరిష్కారం చూపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు సాగిరాజు సూరిబాబు రాజు సంబంధిచిన అధికారులు పాల్గొన్నారు

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!