ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు

    Date:

    📰 Generate e-Paper Clip

    ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు

    కరప, జూలై 13(జిఎస్ బి వార్త)

     

    రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప మండల శివాలయాల్లో మాస శివరాత్రి ,ఆరుద్ర నక్షత్ర పర్వదినాన సోమవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు నియోజకవర్గ పరిధిలోని జనసేన నాయకులు, జనసైనికులు, పార్టీ కార్యకర్తలు తమ తమ గ్రామాల శివాలయాలకు చేరుకుని ప్రత్యేక అర్చనలు నిర్వహించి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం భగవంతుని ప్రార్థించారు. రాష్ట్ర ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా జీవితంలో చురుకుగా పాల్గొనాలని, ఆయనకు దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భక్తిశ్రద్ధలతో వేడుకున్నారు. కరప మండలంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్రగడ రమేష్, Z భావారం జనసేన గ్రామ అధ్యక్షులు గుణ్ణం ఉదయ శంకర్,కోరిపెల్ల జనసేన గ్రామ అధ్యక్షులుదేవిశెట్టి శేఖర్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పూజల్లో శివలింగానికి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక అర్చనలు, హారతులు సమర్పించి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని మరింత ఉత్సాహంతో ప్రజాసేవను కొనసాగించాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి తన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని ప్రతి జనసైనికుడి ఆకాంక్ష అని తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులు, భగవంతుని అనుగ్రహంతో ఆయన త్వరలోనే పూర్తిగా కోలుకుని ప్రజాసేవలో మరింత చురుకుగా పాల్గొంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గొడ్డటి పాలెం జనసేనగ్రామ అధ్యక్షులు వీరం రెడ్డి ముత్యాలరావు, Z భావారం గ్రామ జనసేన గౌరవ అధ్యక్షులు బోనస్ పుల్లయ్య ప్రసాద్,పబ్బినీడి మూర్తి , రెడ్డి లోవరాజు, విష్ణు నాయుడు, తోట కృష్ణ, మొదలగు కూటమి నాయకులు కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    కరప లో సర్ ప్రక్రియను పరిశీలించిన కాకినాడ ఆర్డిఓ. మల్లిబాబు

    కరప లో సర్ పరిశీలించిన కాకినాడ ఆర్డిఓ. మల్లిబాబు   కరప (జిఎస్ బి...

    *వేమగిరి హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, స్వాగతం పలికిన కూటమి నేతలు*

    సీఎం చంద్రబాబు నాయుడు సీఎం తూర్పు గోదావరి జిల్లా*వేమగిరి హెలిప్యాడ్ వద్దకు...

    సెప్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్లో స్థానిక ఎన్నికలు:

    *సెప్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్లో స్థానిక ఎన్నికలు: సీఎం*   ఏపీలో స్థానిక ఎన్నికలపై...

    వియత్నాంలో పడవ ప్రమాదంలో మరణించిన 15 మంది భారతీయ పర్యాటకుల జాబితా. విచారకరమైన వార్త

    వియత్నాంలో పడవ ప్రమాదంలో మరణించిన 15 మంది భారతీయ పర్యాటకుల జాబితా....
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.