ఐ.పోలవరం, జీఎస్బీ వార్త | వేణు కాశి
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఐ.పోలవరం మండల జెడ్పీటీసీ స్థానానికి జనసేన పార్టీ నుంచి రేవు గంగాభవాని పోటీ చేసే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఐ.పోలవరం మండలం తిల్లకుప్ప గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రేవు సత్యనారాయణ సతీమణి గంగాభవాని జెడ్పీటీసీ అభ్యర్థిత్వంపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లలో భాగంగా ఐ.పోలవరం జెడ్పీటీసీ స్థానం ఎస్సీ మహిళకు కేటాయించడంతో ఆమె పేరు తెరపైకి వచ్చినట్లు సమాచారం.
అయితే, జనసేన పార్టీ అధిష్ఠానం ఆమె అభ్యర్థిత్వంపై అధికారికంగా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. పార్టీ నుంచి ఎవరికి అవకాశం లభిస్తుందనే అంశంపై స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

