ఐ.పోలవరం, అక్టోబర్ 15 (జీఎస్బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి):
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలం పాత ఇంజరం గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మాజీ సర్పంచ్ కొండేపూడి కృపా వర ప్రసాద్ భార్య కొండేపూడి దుర్గా రత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు చర్చ సాగుతోంది.
గతంలో సర్పంచ్‌గా పనిచేసిన కొండేపూడి కృపా వర ప్రసాద్ కుటుంబం నుంచి దుర్గా రత్నం పోటీకి సిద్ధమవుతున్నారన్న ప్రచారంతో గ్రామ రాజకీయాల్లో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ అభ్యర్థిత్వం, గ్రామ రాజకీయ సమీకరణాలపై గ్రామస్థుల్లో ఆసక్తి నెలకొంది.

