ఐ. పోలవరం, అక్టోబర్ 22 (జీఎస్బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి):
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం ఐ. పోలవరం మండలం పాత ఇంజరం ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీర సుబ్బలక్ష్మి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆమె నామినేషన్ వేయడంతో పాత ఇంజరం గ్రామంలో రాజకీయ సందడి నెలకొంది.
వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థుల సమక్షంలో నామినేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండేపూడి కృపా వరప్రసాద్, మాజీ ఎంపీపీ మోర్తా మిరియం జ్యోతి, చప్పిడి బుజ్జి ( వెంకటేశ్వర రావు) చింతా ధర్మ రాజు పెద్దిరెడ్డి రాంబాబు కన్నీడీ సత్తిబాబు కాశి ధర్మేంద్ర బొర్రా రాజు కాశి రాంజీ గోడి చిన్న తదితర పార్టీ నాయకులు పాల్గొని బీర సుబ్బలక్ష్మికి మద్దతు తెలిపారు.
పాత ఇంజరం ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ తరఫున బీర సుబ్బలక్ష్మి పోటీకి సిద్ధం కావడంతో స్థానికంగా ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. నామినేషన్ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, గ్రామస్థులు పాల్గొన్నారు.



