Thursday, October 22, 2026
More
    HomeUncategorizedఐ. పోలవరం జెడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా బీర సత్యకుమారి  నామినేషన్ రేపు  మురమళ్ల ఎమ్మెల్యే...

    ఐ. పోలవరం జెడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా బీర సత్యకుమారి  నామినేషన్ రేపు  మురమళ్ల ఎమ్మెల్యే కార్యాలయం నుంచి భారీ ర్యాలీ.. కూటమి శ్రేణులకు ఆహ్వానం

    📰 Generate e-Paper Clip

    ఐ. పోలవరం, అక్టోబర్ 22 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి):

    ఐ. పోలవరం మండల జెడ్పీటీసీ ఎన్నికల బరిలో తెలుగుదేశం–జనసేన కూటమి అభ్యర్థిగా శ్రీమతి బీర సత్యకుమారి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించనున్న నామినేషన్ కార్యక్రమానికి కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని మురమళ్ల ఎమ్మెల్యే కార్యాలయం ఆహ్వానించింది.

    రేపు ఉదయం 11 గంటలకు ర్యాలీ

    ఈ నెల 23వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు మురమళ్లలోని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని ఈదరపల్లి వంతెన సమీపంలో ఉన్న ఎంపీడీవో కార్యాలయానికి చేరుకోనున్నారు. అక్కడ ఎన్నికల అధికారులకు బీర సత్యకుమారి తన నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు.

    కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి

    ఐ. పోలవరం మండలంలో కూటమి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమన్వయంతో పాల్గొనాలని ఎమ్మెల్యే కార్యాలయం విజ్ఞప్తి చేసింది. మండలంలోని కూటమి శ్రేణులు, అభిమానులు సమయానికి మురమళ్ల ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుని ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరింది.

    ఇట్లు: మురమళ్ల ఎమ్మెల్యే కార్యాలయం

     

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Most Popular

    Recent Comments

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!