12, 14, 22వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం
ముమ్మిడివరం, అక్టోబర్ 25 (జీఎస్బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి):
ముమ్మిడివరం నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం 12, 14, 22వ వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ముమ్మిడివరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి పొన్నాడ సతీష్ కుమార్, రాష్ట్ర వైఎస్సార్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యుడు పితాని బాలకృష్ణ ఈ ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో పర్యటిస్తూ, నగర పంచాయతీ చైర్పర్సన్ అభ్యర్థిగా పేర్కొన్న సానబోయిన సునీలాదేవితో పాటు పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.






