ప్రజల మేలు కోసమే కూటమి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్సీ రాజశేఖరం, మాజీ జడ్పీటీసీ నులుకుర్తి

    Date:

    📰 Generate e-Paper Clip

    ప్రజల మేలు కోసమే కూటమి ప్రభుత్వం కృషి:మాజీ ఎమ్మెల్యే పిల్లి,ఎమ్మెల్సీ రాజశేఖరం,

    కాకినాడ రూరల్, ఆగస్టు 04(జిఎస్ బి వార్త): ప్రజల క్షేమం, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనునిత్యం కృషి చేస్తోందని పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, మాజీ జడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు చేపట్టిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ ప్రచార కార్యక్రమం మంగళవారం కాకినాడ నగరంలోని 42వ డివిజన్‌లో అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి నగర్, చిన స్వామి నగర్, ప్రతాప్ నగర్, టీచర్స్ కాలనీ ప్రాంతాల్లో స్థానిక నివాసితుల వద్దకు నేరుగా వెళ్లి వారి పలకరిస్తూ, ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ​ఈ కార్యక్రమంలో టీడీపీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు ముఖ్య నాయకులతో కలిసి ఇంటింటికీ తిరిగారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రజానుకూల సంక్షేమ పథకాలు సమాజంలోని చివరి వ్యక్తికి కూడా అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ కర్రి వెంకట్రాజు, నాయకులు మిరపల ప్రకాష్, సరిదే నాగ హరినాథ్, కొమరిశెట్టి నరసింగరావు, ఎలాగా లోవరాజు, పిల్లి కృష్ణ ప్రసాద్ (బుజ్జి), కాళ్ళ సత్తిబాబు, మట్టా రాము, కాళ్ల శ్రీనివాస్, కర్రి శంకర్, కొండా వినాయక్, జల్లి ముసలి రెడ్డి, యలమంచిలి భాస్కర్ మరియు పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    గొల్లపాలెం సహకార బ్యాంకు లో ఏటీఎం పగలుగొట్టి నగదు చోరీ  సీఐ కృష్ణ చైతన్య పరిశీలన

    గొల్లపాలెం సహకార బ్యాంకు లో ఏటీఎం పగలుగొట్టి నగదు చోరీ సీఐ కృష్ణ...

    ఐ.పోలవరం మండలం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎస్. అమీన్

    భీమ్‌నగర్‌లో ఘన సన్మానం.. అభినందించిన గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఐ.పోలవరం: సెప్టెంబర్...

    నూతన ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

    ఐ.పోలవరం సెప్టెంబర్ 07(జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!