ఐ. పోలవరం, అక్టోబర్ 28 (జీఎస్బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి):
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం ఐ. పోలవరం మండలం కేసనకుర్రు గ్రామంలో ఆర్నాబ్ తుఫాను ప్రభావిత ప్రాంతాలను వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పిన్నమరాజు వెంకటపతిరాజు (శ్రీనురాజు) పర్యటించి పరిశీలించారు.
తుఫాను కారణంగా గ్రామంలో ఏర్పడిన పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రభావిత ప్రాంతాల వివరాలను తెలుసుకున్నారు. తుఫాను ప్రభావంతో ప్రజలకు, స్థానికంగా ఉన్న ఆస్తులకు జరిగిన నష్టంపై వివరాలు ఆరా తీశారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుంటూ, ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని పరిశీలించారు.
ఈ పర్యటనలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు (శ్రీనురాజు), నాని, దేంగేటి నాని, గురు, చిన్నరాజు, యోగి తదితరులు పాల్గొన్నారు.



