ఆస్తి పన్ను వసూళ్లకు వేగం పెంచాలి* *రెవెన్యూ అధికారులకు డిప్యూటీ కమిషనర్ కె. శ్రీనివాస్ ఆదేశాలు*

    Date:

    📰 Generate e-Paper Clip

    *ఆస్తి పన్ను వసూళ్లకు వేగం పెంచాలి*
    *రెవెన్యూ అధికారులకు డిప్యూటీ కమిషనర్ కె. శ్రీనివాస్ ఆదేశాలు

    కాకినాడ సిటీ ఆగస్టు 11 జి ఎస్ బి వార్త

    కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లను మరింత వేగవంతం చేసి, నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ కమిషనర్ కె. శ్రీనివాస్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లతో ఆస్తి పన్ను వసూళ్లపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వార్డుల వారీగా ఆస్తి పన్ను వసూళ్ల పురోగతి, బకాయిల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పన్ను చెల్లింపుల్లో వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, బకాయిదారులను గుర్తించి పన్ను వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రతి రెవెన్యూ అధికారి, ఇన్‌స్పెక్టర్ తమ పరిధిలోని పన్ను వసూళ్లపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పన్ను బకాయిలను సేకరించాలని తెలిపారు. వసూళ్లలో ఎదురవుతున్న సమస్యలనుఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికితీసుకువచ్చిపరిష్కరించుకోవాలనిసూచించారు.అదేవిధంగా ప్రజలకు అందించే పౌర సేవల్లో జాప్యం లేకుండా చూడాలని, పన్ను చెల్లింపుదారులకు అవసరమైన సమాచారం, సహకారం అందించాలని అధికారులకు సూచించారు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఆస్తి పన్ను వసూళ్లు జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని డిప్యూటీ కమిషనర్ కె. శ్రీనివాస్ స్పష్టం చేశారు.
    సమావేశంలో రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
    .

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!