అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం, ఐ. పోలవరం మండలం:
ఐ. పోలవరం ( జియస్ బి వార్త వేణు కాశి) మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సాధారణ సమావేశంలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
గత మూడు సంవత్సరాలుగా ఎంపీపీలు, ఎంపీటీసీలకు గౌరవ వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమకు రావాల్సిన గౌరవ వేతనాలు ఇప్పటివరకు అందలేదని పేర్కొన్నారు.
తమ పదవీకాలం మరికొన్ని రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో, పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాల విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఎంపీటీసీలు కోరారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ అంశంపై ప్రత్యేక చొరవ తీసుకుని ఎంపీపీలు, ఎంపీటీసీలకు రావాల్సిన గౌరవ వేతనాలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను తెలియజేస్తూ, ప్రజాప్రతినిధుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఎంపీటీసీలు డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీపీ మోర్తా మిరియం జ్యోతి వైస్ ఎంపీపీ పిన్నమ రాజు బాబ్జి రాజు మురమళ్ళ ఎంపీటీసీ మట్టాపర్తి శివ ఐ. పోలవరం ఎంపీటిసి దంగుడు బియ్యం వెంకట రామయ్య ఎంపిటిసి షేక్ సుబాన్ బీబీ. కోమరగిరి ఎంపిటిసి సఖిలే పద్మావతి గుత్తేన దీవి ఎంపీటిసి జొన్నడ జ్యోతి జి వేమవరం ఎంపీ టిసి జ్యోతి సత్యం నాయుడు పాల్గొన్నారు

