ఎంపీపీ, ఎంపీటీసీల నల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం, ఐ. పోలవరం:
ఐ. పోలవరం(జియస్ బి వార్త వేణు కాశి) మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సాధారణ సమావేశంలో ఎంపీపీ, వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
గత మూడు సంవత్సరాలుగా ఎంపీపీలు, ఎంపీటీసీలకు గౌరవ వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవలు అందిస్తూ విధులు నిర్వహిస్తున్నప్పటికీ, తమకు రావాల్సిన గౌరవ వేతనాలు ఇప్పటివరకు అందకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
తమ పదవీకాలం మరికొన్ని రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వారు కోరారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకుని ఎంపీపీలు, ఎంపీటీసీలకు రావాల్సిన గౌరవ వేతనాలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజాప్రతినిధుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను తెలియజేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీపీ మోర్తా మిరియం జ్యోతి, వైస్ ఎంపీపీ పిన్నమరాజు బాబ్జీరాజు, మురమళ్ల ఎంపీటీసీ మట్టాపర్తి శివ, ఐ. పోలవరం ఎంపీటీసీ దంగుడు బియ్యం వెంకటరామయ్య, ఎంపీటీసీ షేక్ సుబాన్ బీబీ, కోమరగిరి ఎంపీటీసీ సఖిలే పద్మావతి, గుత్తెనదీవి ఎంపీటీసీ జొన్నాడ జ్యోతి, జి. వేమవరం ఎంపీటీసీ జ్యోతి సత్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

