ఏ ఐ ఇంజనీర్ గా అఖిలేష్ కు కెనడాలోకొలువు- కోటి ఆరు లక్షల రూపాయలతో సంవత్సరిక వేతనం
- యు కొత్తపల్లి (జి ఎస్ బి వార్త ) ఏఐ ఇంజనీర్ గా మాల్తి అఖిలేష్ కెనడాలో కొలువు పొందాడు.కొత్తపల్లి మండలం కుతుకుడు మిల్లి గ్రామానికి చెందిన మాల్తి గంగాధర్ రావు, దేవి ల ప్రధమ కుమారుడు మాల్తి అఖిలేష్ కెనడాలో కోటి ఆరులక్షల సంవత్సర వేతనంతో ఏఐ ఇంజనీర్ గా కొలువు సంపాదించాడు.అఖిలేష్ విద్యాభ్యాసం ఎల్కేజీ నుండి పదవ తరగతి వరకు వివిఎస్ రెడ్డి పబ్లిక్ స్కూల్ లోను, ఇంటర్మీడియట్( ఎంపీసీ ) నారాయణ జూనియర్ కళాశాలలోనూ బి సి ఎ కాకినాడ ఆదిత్య జూనియర్ కళాశాలలోనూ అభ్యసించి ఎంసెట్ లో ర్యాంకు సాధించి సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో డేటా సైన్స్ పూర్తి చేశాడు.యూనివర్సిటీ క్యాంపస్ లో నిర్వహించిన ఇంటర్వ్యూలో ప్యాబ్రానిటిక్ కెనడా కంపెనీలో ఏఐ ఇంజనీర్ గా ఎంపికై కొలువు పొందడు దీనికిగాను కోటి ఆరు లక్షల రూపాయలతో సంవత్సరిక వేతనం పొందేలా ఆఫర్ లెటర్ పొందాడు.ఇంటి వద్ద ఉండి పూర్తిస్థాయిలో విధులు నిర్వహించేలా కొలువు సంపాదించాడు.అఖిలేష్ తండ్రి మూగవాడు దర్జీగా మిషన్ కుట్టి కుటుంబాన్ని పోషిస్తూ అఖిలేష్ చదువుకు సహకారం అందించాడు.తల్లిదండ్రులు పెద్దగా చదువుకోన్నప్పటికీ అఖిలేష్ కు చిన్నతనం నుండి చదువుపై ఉన్న ఆసక్తితో ఈ స్థాయికి చేరాడని తల్లి దేవి పేర్కొంది. అఖిలేష్ ఈ స్థాయికి చేరడం పట్ల మిత్రులు బంధువులు సంతోషం వ్యక్తం చేశారు
