Friday, October 23, 2026
More
    HomeUncategorizedఐ. పోలవరం ఎంపీటీసీ-2కు అప్పాడి కృష్ణవేణి నామినేషన్ వైఎస్సార్‌సీపీ నాయకుల సమక్షంలో నామినేషన్ దాఖలు

    ఐ. పోలవరం ఎంపీటీసీ-2కు అప్పాడి కృష్ణవేణి నామినేషన్ వైఎస్సార్‌సీపీ నాయకుల సమక్షంలో నామినేషన్ దాఖలు

    📰 Generate e-Paper Clip

    ఐ. పోలవరం, అక్టోబర్ 22 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి):

    డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఐ. పోలవరం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో ఐ. పోలవరం గ్రామ ఎంపీటీసీ-2 స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అప్పాడి కృష్ణవేణి గురువారం నామినేషన్ దాఖలు చేశారు.

    పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆమె ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్ దంతులూరి రాఘవరాజు, మాజీ సొసైటీ అధ్యక్షుడు విత్తనాల శ్రీనివాసరావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు కోర్లపాటి ప్రసాద్ పాల్గొని అప్పాడి కృష్ణవేణికి మద్దతు తెలిపారు.

    ఊపందుకున్న స్థానిక ఎన్నికల సందడి

    ఐ. పోలవరం మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తుండటంతో గ్రామాల్లో ఎన్నికల సందడి కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ప్రచారం మరింత జోరందుకోనుంది.

     

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Most Popular

    Recent Comments

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!