కరప లో తొలి జనసేన ఎంపీపీ అభ్యర్థి మురళి నామినేషన్
వైసీపీ యండమూరు ఎంపీటీసీ గా మారెళ్ల
కరప (జిఎస్ బి వార్త)
కరప మండలం జనసేన పార్టీ కూటమి ఎంపీపీ అభ్యర్థి గా బండారు మురళి తో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. బుధవారం ఏకాదశి సందర్బంగా కరప ఎంపీడీఓ కార్యాలయం నందు ఎన్నికలు కరప రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రావు ఈ నామినేషన్ లు స్వీకరించారు. కరప ఎంపీడీఓ జె శ్రీనివాస్, తహసీల్దార్ సరస్వతి, డిప్యుటీ ఎంపీడీఓ లు సలాది శ్రీనివాస్ రావు, కర్రి శ్రీనివాస్ రావు లు పాల్గొని నామినేషన్ లు స్వీకరించారు. అదే విధంగా పెనుగుదురు నుండి బండారు దివ్య మరో నామినేషన్ కరప మార్కెట్ చైర్మన్ ముద్రగడ రమేష్, పెనుగుదురు మాజీ ఎంపీటీసీ తుమ్మల పల్లి మాచర్రావు, పెనుగుదురు నీటి సంఘం అధ్యక్షులు తుమ్మల పల్లి గోవిందరాజులు పాల్గొని నామినేషన్ లు వేశారు. యండమూరు నుండి మాజీ సర్పంచ్ మారెళ్ల వెంకటరమణ వైసీపీ ఎంపీటీసీ గా నామినేషన్ వేశారు.ఎన్నికలు వెళ్ళ ఎటువంటి అవంచనీయ సంఘటన లు జరగకుండా కాకినాడ రూరల్ సీఐ చైతన్య కృష్ణ పర్యటన తో ఎస్ ఐ టీ సునీత, ఏ ఎస్ ఐ లు రెడ్డి, శ్రీనివాస్, వెంకటరమణ పాల్గొన్నారు.
