కాకినాడలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం: వల్లభనేని స్టూడియోస్ ఆధ్వర్యంలో ఫ్యాషన్ షో, అవార్డుల ప్రదానం
కాకినాడ సిటీ ఆగస్టు 2 జి ఎస్ బి వార్త
చేనేత రంగానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా వల్లభనేని స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో స్థానిక కుసుమ సత్య ఫంక్షన్ హాల్లో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకర్షణీయమైన ఫ్యాషన్ షోతో పాటు చేనేత సహకార సంఘాలకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా వల్లభనేని స్టూడియోస్ చైర్మన్ వల్లభనేని గోపీచంద్ మాట్లాడుతూ.. చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఫ్యాషన్, సంస్కృతి, మార్కెటింగ్లను అనుసంధానిస్తూ చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెంచేలా ప్రత్యేక ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపారు.ముఖ్య అతిథిగా హాజరైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ.. చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం పలు పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.చేనేత కార్మికులకు ఘన సత్కారంఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు పప్పు దుర్గా రమేష్, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పల ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఉత్తమ చేనేత సహకార సంఘాలకు అవార్డులు అందజేశారు. విశిష్ట సేవలందించిన చేనేత కార్మికులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పెరబత్తుల రాజశేఖరం, కర్రీ పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి, ‘కూడా’ ఛైర్మన్ తలాటం నాగ వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొని చేనేత రంగ పురోగతిపై మాట్లాడారు. పలు రంగాల ప్రముఖులు, పెద్ద సంఖ్యలో చేనేత సంఘాల ప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

