ప్రజలు చట్టాలపై అవగాహన తో , న్యాయ విజ్ఞానముతో  ముందుకు సాగాలి కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు యేలూరు సుబ్రహ్మణ్యం ,

    Date:

    📰 Generate e-Paper Clip

    ప్రజలు చట్టాలపై అవగాహన తో , న్యాయ విజ్ఞానముతో  ముందుకు సాగాలి

    కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు యేలూరు సుబ్రహ్మణ్యం కాజులూరు (జిఎస్ బి వార్త)

    కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో శనివారం న్యాయవాది, గునిపే బాలాజి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  న్యాయ విజ్ఞాన సదస్సు లో  కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు యేలూరు సుబ్రహ్మణ్యం పాల్గొని ప్రసంగించారు.  సొంత గ్రామంలో ప్రజలకు తన వంతు సహాయం అందించాలనే మంచి ఉద్దేశ్యంతో, బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత గునిపే బాలాజీ సతీమణి పొట్లకాయాల హేమలత ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిదులుగా న్యాయవాదులు పాల్గొని చట్టాలపై అవగాహన నార్వహించారు.న్యాయ విజ్ఞానముతో ప్రజలు మంచి జీవన విధానంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చిన కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు యేలూరు సుబ్రహ్మణ్య , కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో న్యాయవాది, బాలాజి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన పాల్గొని ప్రసంగించారు. సీనియర్ న్యాయవాది, బచ్చు రాజేష్  ప్రస్తుతం ఉన్న పరిస్తితులలో ప్రజలందరూ చట్టాలపై అవగాహన పెంచుకుని జీవించాలని సూచించారు. కాకినాడ మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్యానల్ న్యాయవాది  యడ్ల కుటుంబరావు న్యాయవాది మాట్లాడుతూ పేద ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని ఉచిత న్యాయ సహాయం అందించేందుకు ప్రతి జిల్లా ఆవరణలో న్యాయవాదులను పెట్టుకునే స్థోమత లేని వారికి ఉచితంగా న్యాయ సహాయం కావాలంటే కాకినాడ జిల్లా కోర్టు ఆవరణలో గల మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ వారిని సంప్రదించి న్యాయ సహాయం పొందాలని సూచించారు .ప్రజలందరికీ ఉపయోగపడే ఇంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమం ఏర్పాటు చేసిన బాలాజీ దంపతులను ప్రముకులు సత్కరించారు. అనంతరం బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలు, వృద్ధులకు, నూతన వస్త్రాలను ప్రముఖుల చేతుల మీదుగా అందించారు,10వ తరగతి,ఇంటర్మీడియట్ పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులకు రాయుడు విజయ భాస్కర్ ప్రోత్సహం  అందించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నాగభూషణం, పులిదిండి శేఖర్,సదస్సులో కవి మధునాపంతుల సత్యనారాయణ, వెంటపల్లి రమేష్, గోపాల్ రెడ్డి  తదితరులు పాల్గొని ప్రసంగించారు.

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    ఐ.పోలవరం మండలం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎస్. అమీన్

    భీమ్‌నగర్‌లో ఘన సన్మానం.. అభినందించిన గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఐ.పోలవరం: సెప్టెంబర్...

    నూతన ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

    ఐ.పోలవరం సెప్టెంబర్ 07(జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

    పసిపిల్లల గాయాలకు డిటర్జెంట్ సబ్బా?

      అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్కకాటు చికిత్సపై విచారణ జరపాలి వైద్య నిర్లక్ష్యాన్ని సమర్థించుకునేందుకు...
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!