
*గొబ్బల్ల వీర వెంకట సత్యనారాయణ*
కాకినాడ సిటీ జూలై 13 జి ఎస్ బి వార్త
ఏలేశ్వరం మున్సిపాలిటీకి చెందిన పైలా సుభాష్ చంద్రబోస్ వల్ల తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ ఏలేశ్వరానికి చెందిన గొబ్బల్ల వీర వెంకట సత్యనారాయణ (వీరబాబు) సోమవారం కాకినాడ కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆశ్రయించారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన అధికారులకు వినతిపత్రం అందజేశారు.
అనంతరం బాధితుడు వీరబాబు మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు.
పైలా సుభాష్ చంద్రబోస్ తనపై వ్యక్తిగత కక్ష పెంచుకుని, తన కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కూటమి ప్రభుత్వంలో తాను తన కాలనీ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుండగా, సుభాష్ చంద్రబోస్ తన అనుచరులతో కలిసి తనపై దాడికి పాల్పడ్డాడని ఆరోపించాడు.
రాజకీయ లబ్ధి కోసం అబద్ధాలు: గత 40 ఏళ్లుగా తమ కుటుంబం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతోందని.. కానీ, సుభాష్ చంద్రబోస్ తాను కూటమి పార్టీలో ఉన్నానంటూ మాయమాటలు చెబుతున్నాడని విమర్శించాడు. 2004లో కాంగ్రెస్‌లో, 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీలో పనిచేసిన సుభాష్ చంద్రబోస్.. కూటమి అధికారంలోకి రాగానే దొడ్డిదారిన బీజేపీ కండువా కప్పుకుని కూటమి నేతగా చలామణి అవుతున్నాడని ఆరోపించాడు.కూటమి విజయం కోసం కష్టపడిన తమలాంటి వారిపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నాడని, తనకున్న పరిచయాలతో అమాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నాడని వీరబాబు తెలిపాడు. తాను సాధారణ సెల్‌ఫోన్ మెకానిక్‌గా పనిచేసుకుంటుంటే.. తనపై అక్రమ సంపాదన అంటూ దుష్ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డాడు.ఆస్తులపై విచారణకు డిమాండ్: రాజకీయాల్లోకి రాకముందు పైలా బోసు కుటుంబ పరిస్థితి ఏంటి? ఈరోజు వారి కుటుంబ ఆస్తులు ఏమిటి? అనేది ఏలేశ్వరం పట్టణ ప్రజలందరికీ తెలుసని ఆయన పేర్కొన్నాడు.రాజకీయ పలుకుబడితో వేధింపులకు గురిచేస్తున్న ఇలాంటి వ్యక్తులపై ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని బాధితుడు వీరబాబు మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.
*ప్రాణహాని ఉందంటూ కలెక్టర్, ఎస్పీలను ఆశ్రయించిన బాధితుడు:*
*గొబ్బల్ల వీర వెంకట సత్యనారాయణ*
కాకినాడ సిటీ జూలై 13 జి ఎస్ బి వార్త
ఏలేశ్వరం మున్సిపాలిటీకి చెందిన పైలా సుభాష్ చంద్రబోస్ వల్ల తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ ఏలేశ్వరానికి చెందిన గొబ్బల్ల వీర వెంకట (వీరబాబు) సత్యనారాయణ సోమవారం కాకినాడ కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆశ్రయించారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.
అనంత బాధితుడు వీరబాబు మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు.
పైలా సుభాష్ చంద్రబోస్ తనపై వ్యక్తిగత కక్ష పెంచుకుని, తన కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కూటమి ప్రభుత్వంలో తాను తన కాలనీ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుండగా, సుభాష్ చంద్రబోస్ తన అనుచరులతో కలిసి తనపై దాడికి పాల్పడ్డాడని ఆరోపించాడు.
రాజకీయ లబ్ధి కోసం అబద్ధాలు: గత 40 ఏళ్లుగా తమ కుటుంబం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతోందని.. కానీ, సుభాష్ చంద్రబోస్ తాను కూటమి పార్టీలో ఉన్నానంటూ మాయమాటలు చెబుతున్నాడని విమర్శించాడు. 2004లో కాంగ్రెస్‌లో, 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీలో పనిచేసిన సుభాష్ చంద్రబోస్.. కూటమి అధికారంలోకి రాగానే దొడ్డిదారిన బీజేపీ కండువా కప్పుకుని కూటమి నేతగా చలామణి అవుతున్నాడని ఆరోపించాడు. తాను సాధారణ ఫోన్ మెకానిక్‌గా పనిచేసుకుంటుంటే.. తనపై అక్రమ సంపాదన అంటూ దుష్ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డాడు. ఈరోజు వారి కుటుంబ ఆస్తులు ఏమిటి? అనేది ఏలేశ్వరం పట్టణ ప్రజలందరికీ తెలుసు అని ఆయన అన్నారు.
