మట్టి నమూనా సేకరణ*  *పరీక్ష విధానాలపై* పాఠశాల విద్యార్థులకు అవగాహన

    Date:

    📰 Generate e-Paper Clip

    మట్టి నమూనా సేకరణ*పరీక్ష విధానాలపై* పాఠశాల విద్యార్థులకు అవగాహన

    కరప (జిఎస్ బి వార్త)

    కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎంపిక చేసిన కొన్ని స్కూల్స్ మరియు ఉన్నత పాఠశాలల్లో ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) – వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో *మట్టి నమూనా సేకరణ* మరియు *పరీక్ష విధానాలపై* పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహిచామని మండల వ్యవసాయ అధికారి ఐ . సత్య తెలిపారు.కరప మండలం కరప గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పీకేవీ లక్ష్మి వ్యవసాయ అధికారి, ఎస్టిఎల్ సామర్లకోట మట్టి నమూనా సేకరణ మరియు పరీక్ష విధానాలపై అవగాహన కల్పించారు. ఆమే మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పంటలు దిగుబడులు బాగా రావాలంటే ఖచ్చితంగా భూసార పరీక్ష చేయించి సమతుల్య పోషకాల ఉండేలా రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం సేకరించిన మట్టి నమూనా వివరాలను మొబైల్ యాప్ లో ఆన్లైన్ చేసే విధానమును విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం , సైన్స్ టీచర్ , ఏఈ వో ఎం వి సతీష్ , వి సాయి కృష్ణ, విద్యార్థులు ఇతర టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు.

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!