రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావు నామినేషన్*
*మంత్రి వాసంశెట్టి సుభాష్ తో పాటు భారీగా తరలివచ్చిన కూటమి శ్రేణులు*
*ద్రాక్షారామం నుంచి విజయవంతంగా భారీ ర్యాలీ*
*రామచంద్రపురం పట్టణo రూ.80 కోట్లు.. నియోజకవర్గ అభివృద్ధికి రూ.250 కోట్లకు పైగా నిధులు*
*నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా.. అభివృద్ధికి అంకితమవుతా – చైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావు*
రామచంద్రపురం, అక్టోబర్ 18:*(జిఎస్ బి వార్త)
రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ పదవికి కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఎంపికైన మేడిశెట్టి శేషారావు నామినేషన్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నేతృత్వంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో పట్టణంలో సందడి నెలకొంది. ఉత్సాహభరిత వాతావరణంలో సాగిన భారీ ర్యాలీ విజయవంతంగా సాగింది. అనంతరం మేడిశెట్టి శేషారావు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్‌తో పాటు ఏఎంసీ చైర్మన్ అక్కల రేశ్వంత్ రాయ్, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, నియోజకవర్గ పరిశీలకురాలు మజ్జి పద్మావతి, ఇతర కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.
*భీమేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు.. అనంతరం భారీ ర్యాలీ*
నామినేషన్ దాఖలు చేయడానికి ముందు మేడిశెట్టి శేషారావు ద్రాక్షారామంలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం మంత్రి వాసంశెట్టి సుభాష్‌తో కలిసి భారీ ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొనడంతో ర్యాలీ సందడిగా సాగింది. అనంతరం శేషారావు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ..రామచంద్రపురం పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. గత రెండేళ్లలో పట్టణంలో సుమారు రూ.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. రామచంద్రపురం నియోజకవర్గ అభివృద్ధికి రూ.250 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చాం. రహదారులు, మౌలిక సదుపాయాలు, ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నాం అని తెలిపారు. తాము చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తామని మంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి, ప్రజా సేవ, సంక్షేమమే తమ ప్రధాన అజెండా అని పేర్కొన్నారు. కూటమి పార్టీ చైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావుకు మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం, పారిశ్రామికవేత్తగా గుర్తింపు, సీనియర్ మాజీ జర్నలిస్టుగా సమాజంపై అవగాహన ఉన్నాయని మంత్రి సుభాష్ తెలిపారు. ప్రజా సమస్యల పట్ల అవగాహన కలిగిన ఆయనకు చైర్మన్‌గా సేవ చేసే అవకాశం కల్పిస్తే పట్టణ అభివృద్ధికి మరింత కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. రామచంద్రపురం పట్టణ ప్రజలు మేడిశెట్టి శేషారావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే పట్టణంలోని 32 వార్డుల్లో కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను అత్యధిక p మెజార్టీతో గెలిపించి పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ రామచంద్రపురం పట్టణాన్ని మరింత ప్రగతిపథంలో నడిపించడమే తమ లక్ష్యమని మంత్రి సుభాష్ పేర్కొన్నారు.
నిత్యం ప్రజల్లో ఉంటా.. ప్రజలకు అందుబాటులో ఉంటా.. ఒక్క అవకాశం ఇవ్వండి
*-చైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావు*
మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావు మాట్లాడుతూ..రామచంద్రపురం పట్టణ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాను. విద్యార్థి దశ నుంచే సమాజం పట్ల బాధ్యతతో పనిచేస్తూ మంచి ఆలోచనతో ముందుకు సాగాను. ఇప్పుడు పట్టణ ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం సంతోషంగా ఉంది. ప్రజలు నాపై నమ్మకంతో ఒక్క అవకాశం కల్పిస్తే, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తాను అని హామీ ఇచ్చారు.
మంత్రి వాసంశెట్టి సుభాష్ సహకారంతో పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండటం, వారి సమస్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయడం తన ప్రాధాన్యతలని స్పష్టం చేశారు.
తనకు కూటమి అభ్యర్థిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి వాసంశెట్టి సుభాష్, సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, జనసేన ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, నియోజకవర్గ పరిశీలకురాలు మజ్జి పద్మావతితో పాటు ఇతర కూటమి నాయకులకు శేషారావు కృతజ్ఞతలు తెలిపారు.మంత్రి సుభాష్ పట్టణానికి, నియోజకవర్గానికి తీసుకొచ్చిన అభివృద్ధి నిధులు, చేపట్టిన ప్రజా సేవా కార్యక్రమాలు తన విజయానికి స్ఫూర్తని పేర్కొన్నారు. ముఖ్యంగా పట్టణంలో పశువుల కబేళా తొలగింపునకు మంత్రి సుభాష్ చేసిన కృషి ప్రజలకు గుర్తుండిపోయే అంశమని అన్నారు.
పట్టణ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితమై పనిచేస్తానని, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తానని మేడిశెట్టి శేషారావు తెలిపారు.
*కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన అజెండా- పోలిశెట్టి చంద్రశేఖర్*
జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రామచంద్రపురం మున్సిపల్ ఎన్నికల్లో కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రజల సమస్యలపై అవగాహన కలిగిన నాయకులని తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతామని చెప్పారు.
పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా కూటమి నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రామచంద్రపురం పట్టణ భవిష్యత్తు అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని తెలిపారు.
ఐక్యత చాటిన కూటమి శ్రేణులు.. విజయవంతంగా నామినేషన్ ర్యాలీ*
మేడిశెట్టి శేషారావు నామినేషన్ కార్యక్రమం సందర్భంగా కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంత్రి వాసంశెట్టి సుభాష్‌తో కలిసి శేషారావు ర్యాలీలో పాల్గొనడంతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.కూటమి నాయకుల సమన్వయం, కార్యకర్తల భాగస్వామ్యంతో నామినేషన్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపుపై తమ నిబద్ధతను చాటుతూ నాయకులు ప్రజల సహకారాన్ని కోరారు.రామచంద్రపురం పట్టణాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లడం, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయడం తమ లక్ష్యమని కూటమి నాయకులు తెలిపారు.
