ముమ్మిడివరం, అక్టోబర్ 18 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి):
ముమ్మిడివరం పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులు పితాని బాలకృష్ణ పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ స్థానాల్లో అత్యధిక స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులకు భరోసా కల్పిస్తూ, ఎన్నికల విజయానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పుంగనూరులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణమని, బాధాకరమని పితాని బాలకృష్ణ విమర్శించారు. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వ చర్యలను గమనిస్తున్నారని, ఎన్నికల సమయంలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.
అరాచకాలు, దౌర్జన్యాలతో ఎన్నికల్లో గెలవలేరని, ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రజల మద్దతుతో విజయకేతనం ఎగురవేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

