42 ఏళ్ల తరువాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక
42సంవత్సరాలు తరువాత 1984-85 టెన్త్ బ్యాచ్ 4వ ఆత్మీయ కలయిక
తో పూర్వ విద్యార్థులు వారి చదువుకున్న రోజులు గుర్తు చేసుకున్నారు. ఒకరికొకరు పరస్పర కలయిక ఆత్మీయత పంచుకొంటూ తమ టెన్త్ బ్యాచ్ లో కీర్తి శేషులు అయ్యిన తోటి విద్యార్థులకు ఐదు నిమిషాలు మౌనం పాటించిన తర్వాత పలువురు పూర్వ విద్యార్థుల కలయికతో పలకరించుకొన్నారు.కాకినాడ జిల్లా మండల కేంద్రం కరప లో ఆదివారం దసరా ఉత్సవాలు సందర్బంగా తాము చదివిన పాఠశాలలో 1984-85 బ్యాచ్ తరుపున కరప నక్కా సూర్యానారాయణ మూర్తి జడ్పీపీ పి స్కూల్ టెన్త్ టాప్పర్స్ కి ఇక పై ప్రతి ఏడాది 5వేలు ,3వేలు ,2వేలు ప్రధమ ద్వితీయ,తృతీయ బహుమతులు ఇవ్వడానికి తీర్మానం చేయనుకున్నారు .స్కూల్ అభివృద్ధి కి సహకరిస్తామని ప్రతిజ చేశారు . తమ పిల్లలు సైతం జీవితాల్లో స్థిరపడిన ఇన్నాళ్లకు కలిసి గత రోజులు అనుభూతి పంచుకున్న తీరు తో వారు రాబోయే తరం కు ఆదర్శం గా ఉండాలని గుర్తు చేస్తూ సందేశమిస్తున్నారు. ఈ కలయిక కు పూర్తి భాద్యతలు తీసుకున్న కరప మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతిలు,ఆకులు వెంకట శ్రీనివాస్,శ్రీవత్సవాయ వెంకటపతిరాజు, సలాది సుబ్బారావు, పాట్నీడి అప్పారావు, గొర్రెల నానాజీ, నక్కా ప్రసన్న లక్ష్మి, డాక్టర్ . పర్వతనేని శ్రీదేవి, నక్కా బుజ్జి, గొర్రెల అన్నపూర్ణ, మరియు శ్రీమంతుల రవికు తమ పూర్వ విద్యార్థుల సంఘం అభినందనలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం లో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

