Friday, October 23, 2026
More
    HomeUncategorizedవైసీపీ విజయం ఖాయం.. ముమ్మిడివరం నగర పంచాయతీని కైవసం చేసుకుంటాం కూటమి ప్రభుత్వానికి ప్రజలు...

    వైసీపీ విజయం ఖాయం.. ముమ్మిడివరం నగర పంచాయతీని కైవసం చేసుకుంటాం కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు: మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్

    📰 Generate e-Paper Clip

    వైసీపీ విజయం ఖాయం.. ముమ్మిడివరం నగర పంచాయతీని కైవసం చేసుకుంటాం

    కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు: మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్

    ఐ.పోలవరం, అక్టోబర్ 17 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి):

    డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గంలోని ముమ్మిడివరం నగర పంచాయతీ ఛైర్‌పర్సన్ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సానబోయిన సునీలా దేవి నామినేషన్ దాఖలు చేశారు. బీసీ మహిళకు ఛైర్‌పర్సన్ పదవి రిజర్వ్ కావడంతో ఆమెను అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

    ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ మాట్లాడుతూ, ముమ్మిడివరం నగర పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందనే పూర్తి నమ్మకం ఉందన్నారు. ఛైర్‌పర్సన్ పదవితో పాటు 23 వార్డుల్లోనూ బలమైన అభ్యర్థులను బరిలోకి దించి విజయం సాధించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

    కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. మహిళలకు ఆర్థిక సాయం, తల్లికి వందనం, కొత్త పింఛన్లు, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అంశాల్లో ప్రజలు నిరాశకు గురయ్యారని ఆరోపించారు. అమరావతి అభివృద్ధిపై చూపుతున్న శ్రద్ధను ఇతర ప్రాంతాల సమస్యల పరిష్కారంపైనా చూపాలని హితవు పలికారు.

    వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తించాలని, ముమ్మిడివరం నగర పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని పొన్నాడ సతీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రజలు కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని, నగర పంచాయతీపై వైసీపీ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

     

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Most Popular

    Recent Comments

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!