శాంతియుత సమాజ నిర్మాణానికి ప్రవక్త బోధనలు ఆదర్శం* *: కాకినాడలో ఘనంగా ఈద్ మిలాదున్నబీ వేడుకలు*

    Date:

    📰 Generate e-Paper Clip

    కాకినాడ సిటీ ఆగస్టు 26 జి ఎస్ బి వార్త

    శాంతియుత సమాజ నిర్మాణానికి మహ్మద్ ప్రవక్త బోధనలు ఎంతో ఆదర్శమని ప్రముఖ న్యాయవాది ఎం.డి. జవహర్ అలీ, జామియా మసీద్ అధ్యక్షుడు ఎస్. ఏజాజుద్దీన్ పేర్కొన్నారు. ప్రవక్త బోధించిన శాంతి, సోదరభావం, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం కాకినాడ నగరంలో ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో ఈద్ మిలాదున్నబీ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి.జే. రామారావుపేట నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ జగన్నాథపురం వంతెన, సినిమా రోడ్డు, సంతచెరువు, కల్పన సెంటర్, ఆనందభారతి గ్రౌండ్స్, చిన్నమార్కెట్, టూటౌన్, మెయిన్ రోడ్డు మీదుగా జగన్నాథపురంలోని మస్జిద్-ఏ-అజాం వరకు సాగింది. మెయిన్ రోడ్డులోని జామియా మసీద్ వద్దకు ర్యాలీ చేరుకోగానే నిర్వాహకులు ఘన స్వాగతం పలికి, పాల్గొన్న వారికి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. కుల, మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ సోదరభావంతో జీవించాలని, సమాజంలో శాంతి సామరస్యాల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ భాషా, అజ్జు, రెహమాన్ ఖాన్, శుభాని, తానేషా, రహీం, ఫిరోజ్ తదితర మైనార్టీ నాయకులు, మత పెద్దలు, జామియా మసీద్ ప్రతినిధులు, నగర ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    పసిపిల్లల గాయాలకు డిటర్జెంట్ సబ్బా?

      అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్కకాటు చికిత్సపై విచారణ జరపాలి వైద్య నిర్లక్ష్యాన్ని సమర్థించుకునేందుకు...

    రూ.1,700 కోట్ల అభివృద్ధి పరుగులు.. ముమ్మిడివరంలో దాట్ల మార్క్‌!

    నాలుగు మండలాలు.. ఒకే విజన్‌.. అభివృద్ధి బాటలో...

    రూ.1,700 కోట్ల అభివృద్ధి జోరు.. ముమ్మిడివరంపై దాట్ల మార్క్‌!

    నాలుగు మండలాలు.. అభివృద్ధి, సంక్షేమానికి...
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!