Saturday, November 7, 2026
More
    HomeUncategorized,213 ఓట్ల భారీ మెజారిటీతో బీర సత్యకుమారి ఘన విజయం ఐ. పోలవరం జడ్పీటీసీ...

    ,213 ఓట్ల భారీ మెజారిటీతో బీర సత్యకుమారి ఘన విజయం ఐ. పోలవరం జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న టీడీపీ అభ్యర్థి

    📰 Generate e-Paper Clip

    ఐ. పోలవరం, నవంబర్ 7 (జీఎస్‌బీ వార్త):

    డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఐ. పోలవరం మండల జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని బీర సత్యకుమారి ఘన విజయం సాధించారు. శనివారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో తన సమీప ప్రత్యర్థిపై 9,213 ఓట్ల భారీ మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు.

    ఓట్ల లెక్కింపు అనంతరం వెలువడిన ఫలితాల్లో బీర సత్యకుమారి స్పష్టమైన ఆధిక్యతతో విజయం సాధించడంతో ఐ. పోలవరం మండల జడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఈ విజయంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆమెకు అభినందనలు తెలియజేశారు.

    – వేణు కాశి రిపోర్టర్, జీఎస్‌బీ వార్త ఐ. పోలవరం మండలం

     

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Most Popular

    Recent Comments

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!