జీఎస్‌బీ వార్త | రిపోర్టర్ వేణు కాశి
ఐ. పోలవరం: ఐ. పోలవరం మండలంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ అభ్యర్థి నాగమణి 508 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యం సాధించి ప్రజల మద్దతుతో విజయాన్ని కైవసం చేసుకున్నారు.
నాగమణి సాధించిన ఈ విజయంతో ఐ. పోలవరం మండలంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పార్టీ శ్రేణులు అభినందనలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా దేవు రాంబాబుకు, విజేత నాగమణికి పలువురు నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.


