- ఐ.పోలవరం ఆగస్ట్ 09 ( జియస్ బి వార్త) మురమళ్ల: ఆషాఢ మాసంలో అమ్మవార్ల కు సారే సమర్పణ చేస్తే అమ్మ దయవల్ల రాష్ట్రం, గ్రామం సుభిక్షంగా ఉంటుందని లోకకళ్యాణార్ధం ఆషాఢ సారే కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా నిర్వహించినట్లు ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుతపాల్గొన్నా దాట్ల సుబ్బరాజు అన్నారు. ఆదివారం మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం నుండి ఆలయ అర్చకులు, పురోహితులు వేద పండితుల మంత్రోచ్ఛారణ లమద్య గ్రామదేవతలైన కనక మహాలక్షి, మాణిక్యాంబ అమ్మవార్లకు సారే సమర్పించారు. తొలుత భద్రకాళి అమ్మవారికి, లక్ష్మీ నృసింహ స్వామి వారి ఆలయం లో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయం నుండి భారీ ఊరేగింపు గా మేళతాళాలతో చిన్నారుల కోలాటాలతో గరగ నృత్యాలతో అమ్మ వార్ల ఆలయం వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు జరిపారు. దేవస్థానం తరపున సమకూర్చిన వివిధ రకాల పువ్వులు, పండ్లు, స్వీట్లు, పసుపు, కుంకుమ సమర్పణ చేశారు. గజమాలతో, శంకంబరి అలంకరణతో అలంకరించారు. ఈ కార్యక్రమా నికి చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు అసిస్టెంట్ కమీషనర్ వి సత్యనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. కార్యక్రమానికి అనంతరం
శాసనసభ్యులు వారికి దుశ్శాలువ తో సత్కరించి ఆశీర్వచనం చేశారు.
కార్యక్రమంలో ఆయా ఆలయాల కమిటీ నిర్వాహకులు, మాజీ చైర్మన్ లు, ధర్మకర్త మండలి సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు.

