ఎన్టీఆర్ జిల్లా నందిగామ:
నందిగామ పట్టణంలో నేతాజీ నగర్ కు చెందిన షేక్ బాజీ అనే(10)సం బాలుడు అరుదైన ఈయింగ్ సరాకోమాఅనే ప్రాణాంతకమైన వ్యాధి (బోన్ క్యాన్సర్) తో బాధపడుతున్నాడు….
2016లోజన్మించినఈ బాలుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 5 తరగతి చదువుతుండగా 2024 లోతరచు అనారోగ్య సమస్యతోబాధపడుతుంటే ఆసుపత్రిలోచూపించగా మొదటి లోఈవ్యాధిని గుర్తించలేకపోయి నప్పటికీమెరుగైన వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఈయింగ్ సరాకోమా (బోన్ క్యాన్సర్) గా గుర్తించారు డాక్టర్లు…
బాలుడి తండ్రి ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోవడంతో బాలుడు తల్లి షహనాజ్ టైలరింగ్ వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ బాలుడికి వైద్య ఖర్చులను అందిస్తుంది…
ఇప్పటివరకు తన దగ్గర ఉన్న ఆస్తి మొత్తం అమ్మి తన కుమారుడికి చికిత్స అందించానని ఇప్పటివరకు 15 లక్షల రూ ఖర్చయిందని ఇంకా 40 లక్షలు ఉంటే మెరుగైన వైద్య చికిత్సఅందించి తన కుమారుడును బ్రతికించుకునే అవకాశా లు ఉన్నాయని తల్లి షహనాజ్ తెలిపింది….
ఇప్పటికే తన కుమారుడు యొక్క వ్యాధి గురించి స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు తెలిపానని వెంటనే వెంటనే స్పందించి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నారా లోకేష్ కి బాజీ సమస్యను వివరిస్తూ లెటర్ రాసి తల్లికి ఇవ్వటం జరిగిందని…
ఆ తర్వాత మంగళగిరిలోని నారా లోకేష్ కార్యాలయానికి పలుమార్లు వెళ్లి తన బిడ్డతో కలిసి ఆ లెటర్ ని ఇవ్వటం జరిగిందని ఇప్పటివరకు తమకు ఎటువంటి సహాయం అందలేదని బాజీ తల్లి సహనాజ్ తెలిపింది…
కూటమి ప్రభుత్వం ఆదుకుంటే తన కుమారుడు బతికే అవకాశాలు ఉన్నాయని వేడుకుంటుంది బాలుడు తల్లి సహనాజ్…
