ఐ. పోలవరం, నవంబర్ 7 (జీఎస్‌బీ వార్త):
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఐ. పోలవరం మండలంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొంతు దేవి రాధిక సత్తా చాటారు. ఐ. పోలవరం ఎంపీటీసీ-2 స్థానం నుంచి పోటీ చేసిన ఆమె తన సమీప ప్రత్యర్థిపై 370 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు.
ఓట్ల లెక్కింపు అనంతరం వెలువడిన ఫలితాల్లో బొంతు దేవి రాధిక స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విజయంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. పార్టీ శ్రేణులు ఆమెకు అభినందనలు తెలియజేస్తూ సంబరాలు జరుపుకున్నారు.
మండలంలో టీడీపీకి లభించిన ఈ విజయం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.
జీఎస్‌బీ వార్త రిపోర్టర్: వేణు కాశి

