” కులం కుళ్ళు నింపుకున్న – ఓ మానవుడా,
” నీవెన్ని పూజలు చేసి – ఫలితమేమిరా ” అనే పాటను మాజీ మంత్రి కురసాల కన్నబాబు చేతులు మీదుగా కాకినాడ లో వారి స్వగృహంలో ఆవిష్కరించారు . ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ రాజేష్ పుస్తక రచన చేస్తూనే మరో పక్క సామాజిక సేవ చేస్తున్న వ్యక్తి అని కొనియాడారు. రాజేష్ వ్రాసి, ఆలపించిన ఈ గీతం “సాటి మనిషిని ప్రేమించడమే నిజమైన భక్తి ” అనే దానిని తెలుపడం. కొత్త పక్రియకు శ్రీకారం చుట్టిన సవిలే రాజేష్‌కు శుభాకాంక్షలు. ఈ బౌ కార్యక్రమంలో లైఫ్ లైన్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ కోరుకొండ భానుమతి, స్టేట్ గూడ్స్ & సర్వీస్ టాక్స్ అధికారి సాంబత్తుల వెంకట్రావు, ఉపాసక గిడ్ల వీర ప్రసాద్, బిషప్ మేడపాటి రాజ కుమార్, అడ్వకేట్ యడ్ల కుటుంబరావు, కనికెళ్ళ రాజబాబు, ఫణి కుమార్, చిన్నం వెంకటేశ్వరరావు, దాలిపర్తి శ్రీనివాస్ ఉన్నారు.

