వేళంగి లో రోటరీ గోల్డ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున్న 700 మంది కి ఉచిత మెగా వైద్య శిబిరం.

    Date:

    📰 Generate e-Paper Clip

    వేళంగి లో రోటరీ గోల్డ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున్న 700 మంది కి ఉచిత మెగా వైద్య శిబిరం.

     

    కరప (జిఎస్ బి వార్త)

     

    కరప మండలం వేళంగి లో రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ ఉచిత మెగా వైద్య శిబిరాన్నిభారీ ఎత్తున్న నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ వి ఎన్ వి సతీష్ ,క్లబ్ కోశాధికారి నల్లమిల్లి మాచారెడ్డి తెలిపారు .ఈ వైద్య శిబిరం రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ క్లబ్బు ఉపాధ్యక్షులు, డాల్ఫిన్ గార్డెన్ రెస్టారెంట్ అధినేత బదిరెడ్డి వెంకన్న ఆధ్వర్యంలో వేలంగి ప్రముఖ వైద్యులు డాక్టర్ బొండా వెంకన్నా రావు (నాయుడు డాక్టర్) వైద్య శిబిరంలో సుమారు 700 మంది కి ప్రముఖ వైద్యులు తో వైద్య సేవలు అందించారు .ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 19 మంది ప్రముఖ వైద్యులు పాల్గొని రోగులకు వైద్య సలహాలతో పాటు పరీక్షలు నిర్వహించారు. సుమారు 2 లక్ష రూపాయలు పైగా ఉచితంగా మందులను పంపిణీ చేశారు.

    వేలంగి మార్కెట్ సెంటర్ దగ్గర నాయుడు డాక్టర్ హాస్పిటల్ శ్రీనివాస నర్సింగ్ హోమ్ లో ఈ వైద్య శిబిరం నిర్వహించారు .ఈ వైద్య శిబిరాన్ని కాకినాడ, విశాఖపట్నం సరోజినీ దేవి స్కిన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ యరమాటి సత్యనారాయణ ప్రారంభించగా ముఖ్యఅతిథిగా కాకినాడ సుధా యూరాలజీ హాస్పిటల్ అధినేత రోటరీ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ ఎస్ వి ఎస్ రావు, ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ (ఆర్ కే) రామకృష్ణ, తదితరులు పాల్గొంటున్నారని సమావేశానికి క్లబ్ అధ్యక్షులు డాక్టర్ మేడపాటి కృష్ణారెడ్డి అధ్యక్షతన కార్యదర్శి వడ్డాది ఆదిత్య వైద్య శిబిరo లో సేవలాందించారు .ఈ వైద్య శిబిరంలో కాకినాడ రోటరీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని రోటరీ బ్లడ్ బ్యాంక్ కార్యదర్శి నల్లమిల్లి మాచారెడ్డి నిర్వహించారు.రాజానగరం జిఎస్ఎల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ మామోగ్రఫీ అల్ట్రా సౌండ్ వైద్య పరీక్షలు నిర్వహించారు . కిమ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్డియాలజీ విభాగంలో 2డి ఏకో మరియు ఈసీజీ పరీక్షలు చేశారు. డాక్టర్ సలహా మేరకు 40 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే ఈ అవసరమైన పరీక్షలు నిర్వహించారు.

    ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్ వి ఎస్ రావు (యూరాలజీ), డాక్టర్ బోండా సూర్యరావు (ఆర్థోపెటిక్ ),డాక్టర్ వి ఎన్ వి సతీష్( దంత వైద్యనిపుణులు), డాక్టర్ ఎం పని రమణ భూషణ్ (జనరల్ మెడిసిన్ ),డాక్టర్ సానా ప్రవీణ్ (నెఫ్రాలజిస్ట్), డాక్టర్ సురేస్వర్ (కార్డియాలజిస్ట్), డాక్టర్ డి శేషగిరిరావు (పల్మనాలజిస్ట్), డాక్టర్ రావుల శ్రీరామ్ (కంటి వైద్య నిపుణులు), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కాకినాడ చాప్టర్ కార్యదర్శి డాక్టర్ సి హెచ్ ఎస్ రామకృష్ణ ,డాక్టర్ సత్య సందీప్ సలాది (మధుమేహ నిపుణులు), డాక్టర్ జ్యోతిర్మయి సలాది( స్త్రీ ప్రత్యేక వైద్య నిపుణులు), డాక్టర్ నాగ నితిన్ సలాది (జనరల్ మరియు క్యాన్సర్ సర్జన్), డాక్టర్ సారుస్య సలాది (చిన్నపిల్లల వైద్యనిపుణులు) డాక్టర్ ఆదిత్య ప్రసన్నకుమార్ (గ్యాస్ట్రో ఎంటరాజస్ట్ ),డాక్టర్ వెలగా సత్తిరాజు (ఈ ఎన్ టి విపుణులు), డాక్టర్ ఎం నివేదిత) జనరల్ మెడిసిన్) డాక్టర్ బి సాయి శ్రీకృతి (గైనకాలజిస్ట్) వంటి ప్రముఖ వైద్యులు ఈ వైద్య శిబిరంలో సేవలoదించారు. డాక్టర్ సతీష్, నల్లమిల్లి మాచారెడ్డి తెలిపారు. ఈ మెగా నిర్వహించడం తో తమకు సంతృప్తి కలిగిందని,ఉచిత వైద్య శిబిరాన్ని వేలంగి లో రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ఉపాధ్యక్షులు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వాహకులు

    బదిరెడ్డి వెంకన్న తెలిపారు.

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    ఐ.పోలవరం మండలం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎస్. అమీన్

    భీమ్‌నగర్‌లో ఘన సన్మానం.. అభినందించిన గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఐ.పోలవరం: సెప్టెంబర్...

    నూతన ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

    ఐ.పోలవరం సెప్టెంబర్ 07(జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

    పసిపిల్లల గాయాలకు డిటర్జెంట్ సబ్బా?

      అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్కకాటు చికిత్సపై విచారణ జరపాలి వైద్య నిర్లక్ష్యాన్ని సమర్థించుకునేందుకు...
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!