కరప లో కలెక్టర్   ఒక నెల – ఒక గ్రామం” ప్రజా సమస్యల పరిష్కార వేదిక ట్రైనీ కలెక్టర్ ప్రియా ఆధ్వర్యంలో 95పిర్యాదు లు స్వీకరణ 

    Date:

    📰 Generate e-Paper Clip

    కరప కలెక్టర్   ఒక నెల – ఒక గ్రామం” ప్రజా సమస్యల పరిష్కార వేదిక

    ట్రైనీ కలెక్టర్ ప్రియా ఆధ్వర్యంలో 95పిర్యాదు లు స్వీకరణ 

    ఎంపీటీసీ లు గౌరవ వేతనం రావడం లేదని కరప ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి పిర్యాదు 

    కరప, ఆగస్టు 7:(జిఎస్ బి వార్త)

    ​కరపలోని మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం కాకినాడ రూరల్ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన “ఒక నెల – ఒక గ్రామం” ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. ​రాష్ట్ర మంత్రుల జిల్లా పర్యటన కారణంగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఈ సమావేశానికి హాజరుకాలేదు.ట్రైనీ కలెక్టర్ ప్రియా, రూరల్ ని యోజకవర్గ ప్రత్యేకాధికారి, కాకినాడ ఆర్టీఓ ఎస్. మల్లిబాబు, , డీడీఓ పి. వాసుదేవరావు బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. కరప, కాకినాడ రూరల్ మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.​ఈ ప్రజా వేదికలో 95 పిర్యాదు లు రాగా సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలు, తల్లికి వందనం పథకం లబ్ధి, ఇళ్ల స్థలాల పట్టాలు, హౌసింగ్ రుణాలు, ఆసైన్డ్ భూములను 22ఎ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్లపై ఎక్కువ అర్జీలు వచ్చాయి. ముఖ్యంగా జెడ్. భావరం ప్రాంతం నుంచి రోడ్లు, డ్రెయిన్ల కోసం ఏకంగా 40 కి పైగా అర్జీలు రాగా, వేళంగిలో లీకవుతున్న పీహెచ్‌సీ భవనానికి నిధులు ఇవ్వాలని కూటమి నాయకులు వినతిపత్రం ఇచ్చారు. ​ ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం త్వరలో ముగియనున్నా గత మూడేళ్లుగా గౌరవ వేతనం రావడం లేదని కరప ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మిసత్తిబాబు అధికారులు కు ఎంపీటీసీ లు తరపున పిర్యాదు అందించారు . కాకినాడ భానుగుడి సెంటర్‌లోని బస్ షెల్టర్ లోపాలు, కరప మెయిన్ రోడ్డులో చిరువ్యాపారుల ఆక్రమణలు, మార్కెట్ సెంటర్‌లో ఆటోల వల్ల తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలు, జగనన్న కాలనీల్లో వీధిదీపాలు, రోడ్ల లేమిపై స్థానికులు సంతకాలతో కూడిన వినతులను కరప మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతిలు, టీడీపీ నాయకులు దేవు వెంక్కన్న వినతి అందించారు. పంట కాలువల ఆక్రమణ, ఆక్వా చెరువుల కలుషిత నీటి విడుదల, భూ విస్తీర్ణంలో వ్యత్యాసాలపై కూడా పలు ఫిర్యాదులు నమోదయ్యాయి.అందిన ప్రతి అర్జీని ఆన్‌లైన్‌లో నమోదు చేశామని, ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ప్రత్యేకాధికారి మల్లిబాబు తెలిపారు. అభివృద్ధి పనులకు సంబంధించిన వినతులపై ఎంత ఖర్చు అవుతుందో వెంటనే అంచనాలు (ప్రతిపాదనలు) తయారు చేసి నివేదిక ఇవ్వాలని మండల స్థాయి అధికారులను ఆయన ఆదేశించారు. సంబంధిత శాఖాధికారుల సమక్షంలో సమస్యలను చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కరప, కాకినాడరూరల్ మండలాల ఎంపీడీఓలు జె. శ్రీనివాస్, ఎస్.సతీష్, కరప తహసీల్దార్ ఆకుల లక్ష్మీసరస్వతి,డిప్యూటీ ఎంపీడీఓలు ఎస్వీ శ్రీనివాసరావు,మండల సచివాలయాల అధికారి కర్రి శ్రీనివాసరావు,ఎం ఈ ఓ కొప్పుల బుల్లి కృష్ణ వేణి,వివిధశాఖల అధికారులు, కార్యదర్శి లు, వి ఆర్ ఓ లు, అధికారులు పాల్గొన్నారు..

    Previous article
    Next article
    ఆంధ్రప్రదేశ్ లో. IAS అధికారుల బదిలీలు నియామకాలు… IAS అధికారుల బదిలీలు, పోస్టింగ్స్‌ పై ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఎస్ ఎస్. రావత్ – పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ. జె. శ్యామలరావు – పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ. కోనా శశిధర్ – రవాణా, రోడ్లు–భవనాల శాఖ కార్యదర్శిగా నియామకం. ఎం. శివ ప్రసాద్, IFS – ఏపీఎస్‌ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ. అమ్రపాలి కాటా – ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి రిలీవ్; తదుపరి పోస్టింగ్ కోసం GADకు రిపోర్ట్ చేయాలని ఆదేశం. పట్టంశెట్టి రవి సుభాష్ – ఏపీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియామకం; APPSCలో CEO, సెక్రటరీ పోస్టులకు FAC బాధ్యతలు. సురేష్ కుమార్ – గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా నియామకం. నారాయణ భరత్ గుప్తా – గోదావరి పుష్కరాల జాయింట్ స్పెషల్ ఆఫీసర్‌గా నియామకం. ముత్యాలరాజు రేవు – పురావస్తు, మ్యూజియంల కమిషనర్‌గా బదిలీ. కె.వి.ఎన్. చక్రధర బాబు – ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్, నేషనల్ హెల్త్ మిషన్ ఎండీగా FAC బాధ్యతలు. హెప్సిబా రాణి కొర్లపాటి – హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియామకం; ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా FAC. పి. అరుణ్ బాబు – డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్‌గా నియామకం. ఎన్. తేజ్ భరత్ – విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ బాధ్యతల నుంచి రిలీవ్. ప్రఖర్ జైన్ – విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్‌గా నియామకం. గీతాంజలి శర్మ – ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ ఎండీగా FAC బాధ్యతలు. చేతన్ టి.ఎస్. – డైరెక్టర్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌గా FAC బాధ్యతలు. డా. ఎ. శరత్ (రిటైర్డ్ IAS) – తిరుమల తిరుపతి దేవస్థానాల **జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (హెల్త్ & ఎడ్యుకేషన్)**గా కొనసాగింపు. ప్రభల గోపీనాథ్ – టీటీడీ **జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (హెల్త్ & ఎడ్యుకేషన్)**గా నియామకం. ఎ.ఎ.ఎల్. పద్మావతి – ఎన్‌టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా FAC బాధ్యతలు. ఎం. జయకృష్ణ – తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియామకం. బి. అనిల్ కుమార్ రెడ్డి – ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ బాధ్యతల నుంచి రిలీవ్. బి. సునీల్ కుమార్ రెడ్డి, IFS – ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా FAC బాధ్యతలు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు కొత్త కమిషనర్‌గా ఎం. జయకృష్ణ IAS. టీటీడీలో హెల్త్ & ఎడ్యుకేషన్ విభాగానికి జాయింట్ ఈవోగా డా. ఎ. శరత్ కొనసాగింపు. ప్రభల గోపీనాథ్‌కు టీటీడీ జేఈవో (హెల్త్ & ఎడ్యుకేషన్) బాధ్యతలు. ఎన్‌టీఆర్ వైద్య సేవా ట్రస్ట్‌కు ఎ.ఎ.ఎల్. పద్మావతికి FAC బాధ్యతలు.

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    గొల్లపాలెం సహకార బ్యాంకు లో ఏటీఎం పగలుగొట్టి నగదు చోరీ  సీఐ కృష్ణ చైతన్య పరిశీలన

    గొల్లపాలెం సహకార బ్యాంకు లో ఏటీఎం పగలుగొట్టి నగదు చోరీ సీఐ కృష్ణ...

    ఐ.పోలవరం మండలం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎస్. అమీన్

    భీమ్‌నగర్‌లో ఘన సన్మానం.. అభినందించిన గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఐ.పోలవరం: సెప్టెంబర్...

    నూతన ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

    ఐ.పోలవరం సెప్టెంబర్ 07(జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!