Friday, November 6, 2026
More
    HomeUncategorizedకరప లో జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు 63శాతం తో మందకోడిగా పోలింగ్ - మండలం...

    కరప లో జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు 63శాతం తో మందకోడిగా పోలింగ్ – మండలం లో అత్యధికముగా ఉప్పలంక 82.20శాతం  అత్యాల్పంగా నడకుదురు 2. 43.58

    📰 Generate e-Paper Clip

    కరప లో జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు 63శాతం తో మందకోడిగా పోలింగ్

    –

    మండలం లో అత్యధికముగా ఉప్పలంక 82.20శాతం

    అత్యాల్పంగా నడకుదురు 2. 43.58

     

    కరప (జిఎస్ బి వార్త)

    కరప మండలం లో 63 శాతం తో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతం గా జరిగాయి. అయితే పోలింగ్ మందకోడిగా సాగింది. గురువారం 5వ తేది ఉదయం 7 గంటలకు ప్రారంభించిన పోలింగ్ మధ్యాహ్నం కు 50 శాతం మాత్రమే పోలయింది. గ్రామాలు వారుగా ఈ విధంగా పోలింగ్ ఉన్నాయి.కరప మండలం లో 22 ఎంపీటీసీ లకు గాను నడకుదురు 2 ఏకగ్రీవం ఐయ్యింది. మిగిలిన 21 ఎంపీటీసీ లకుగాను పోలింగ్ జరిగింది. అరట్లకట్ల లో 3264 మంది ఓటర్ల కు గాను 1998 మంది ఓటుహక్క వినియోగించు కుని 61.21% పోలింగ్ నమోదయింది. గొడ్డెటి పాలెం 16 33 ఓటర్లు ఉండగా 10 91 మంది ఓటుహక్కు వినియోగించు కుని 66.81% నమోదు.కోరిపల్లి 258 మంది ఓటరు లకు 17 33 ఓటర్లు నమోదు తో 68.01శాతం.నడకుదురు 1కు 3 171 ఓటర్లకు 2017 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోగా 63.6%.నడకుదురు2కు కేవలం జడ్పిటిసి మాత్రమే 3184 ఓటర్లకు గాను కేవలం 1386మంది మాత్రమే ఓటు హక్కు నియమించుకుని 43.58 శాతం నమోదయింది. పెనుగుదురు లో ఎంపీపీ అభ్యర్థికి పోటీ ఉంటుందనుకున్న పరిస్థితుల్లో 3765ఓటర్లు కు గాను 2763 మంది ఓటు హక్కు వినియోగించుకుని 73.53% పోలింగ్ నమోదయింది. ఉప్పలంకలో అత్యధికంగా 2028 ఓటర్లకు గాను 1667 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 82.20 శాతం తో మండలం కు అత్యధికముగా పోలింగ్ నమోదు అయింది.గురజానాపల్లిలో 4048మంది ఓటర్లు కు 25 31 మంది ఓటుహక్కు వినియోగించుకుని 62.52 శాతం పోలింగ్ నమోదు. కరప 1కు 3186 మందికి గాను 1987 మంది ఓటు హక్కు వినియోగించుకుని 62.37% నమోదు.కరప2. 2655 మందికి గాను 16 73 పోలింగ్ నమోదయి 63.013 %.నమోదు.కరప 3కు .26 59 మందికి గాను 18 66 ఓటింగ్ తో 70. 18%.నమోదు.వేములవాడ 4273 మందిఓటర్లు కు గాను 2685 మంది ఓటుహక్కు వినియోగించుకోగా 62.84% పోలింగ్ నమోదయింది. వాకాడ 1924 మందిఓటర్లు కు గాను 1327 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 68.97% నమోదయింది. వేళంగి 1కు 2989 మందికి ఓటర్లు కు గాను 1790 మంది ఓటు హక్కు వినియోగించుకుని 59.89 శాతం నమోదయింది. వేళంగి 2కు 2994 మంది ఓటర్లు కు గాను 1904 పోలింగ్ నమోదయి 63.59 శాతం నమోదయింది. సిరిపురం 1848 మందికి ఓటర్లు కు గాను 1333 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 72.13% నమోదయింది. పెద్దాపురం పాడు3257 ఓటర్లు కు గాను 2018 ఓటింగ్ తో వినియోగించుకుని 67.59 శాతం నమోదయింది. కొంగోడు 2802 మందిఓటర్లు కు గాను 2024 ఓటర్లు తో 72.23% నమోదయింది. గొర్రిపూడి 1కు 2702 మందికి ఓటర్లు కు గాను 1979 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 73.24 శాతం నమోదయింది. గొర్రెపూడి 2.2702 మందిఓటరులు కు గాను 2111 మంది ఓటుహక్కు వినియోగించుకోగా అత్యధికంగా 78. 13% ఓటర్ నమోదు అయింది. ఎన్నికలు లో సిబ్బంది ముందస్తు ప్రణాళిక లు తో ఎటువంటి ఇబ్బంది లేకుండా సునయశంగా పోలింగ్ ప్రక్రియ ముగించారు. ఈ కార్యక్రమం లో కాకినాడ ఎస్పీ, జేసీ, ఎన్నికలు అధికారులు, కరప రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రావు,తహసీల్దార్ సరస్వతి , ఎం ఈ ఓ కొప్పుల బుల్లి కృష్ణ వేణి,ఎంపీడీఓ జె శ్రీనివాస్,డిప్యుటీ ఎంపీడీఓ లు సలాది శ్రీనివాస్ రావు కర్రి శ్రీనివాస్ రావు, ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది ఏ ఓ నరసింహారావు, ఎస్ ఐ టీ సునీత, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Most Popular

    Recent Comments

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!