డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా – ముమ్మిడివరం నియోజకవర్గం:
ఐ. పోలవరం మండలం పరిధిలో జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ముమ్మిడివరం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) గురువారం మురమళ్ల గ్రామంలో తన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న ఓటింగ్ సరళిని పరిశీలించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ప్రతి ఓటరు తమ ఓటు విలువను గుర్తించి బాధ్యతగా ఓటు వేయాలని ఎమ్మెల్యే కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములై తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని, వంద శాతం పోలింగ్ సాధనకు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
జీఎస్బీ వార్త | రిపోర్టర్: వేణు కాశి


