ఐ.పోలవరం, అక్టోబర్ 25 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి): డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం, ఐ.పోలవరం మండలం కరవాకులంక గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి పెసింగి వెంకన్నబాబు ఆధ్వర్యంలో ఆదివారం ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగుతూ గడపగడపకు వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.
ప్రచార కార్యక్రమానికి ముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పెసింగి వెంకన్నబాబుకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనడంతో గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది.
పెసింగి వెంకన్నబాబు విజయమే లక్ష్యంగా..
కరవాకులంక గ్రామంలో పార్టీ శ్రేణులంతా సమష్టిగా ప్రచారంలో పాల్గొని అభ్యర్థి విజయానికి కృషి చేశారు. ప్రజలను నేరుగా కలుసుకుంటూ పార్టీ అభ్యర్థికి మద్దతు కోరారు. గ్రామంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంగడి సీతారాం, గుత్తెనదీవి వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు కసింగి మూర్తి, బోమిడి లక్ష్మీనారాయణ, ములపర్తి శ్రీనుబాబు, ఎలిపే రాజేష్, బూసి జై భీమ్, కాటే సత్యనారాయణ, దేవరపల్లి పావనుమూర్తి, ఎలిపే కిషోర్, బోమిడి లోవరాజు, కాటేసి సింహాద్రి, కాశి ధర్మారావు, రేవు నాగేశ్వరరావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు “జై జగన్.. జై వైఎస్సార్.. పెసింగి వెంకన్నబాబు నాయకత్వం వర్ధిల్లాలి” అంటూ నినాదాలు చేస్తూ ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు.


