వైఎస్సార్సీపీ రైతు విభాగ రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సత్యనారాయణ (ఢిల్లీ నారాయణ) సమక్షంలో నామినేషన్ దాఖలు
ఐ. పోలవరం, అక్టోబర్ 23 (జీఎస్బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి):
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఐ. పోలవరం మండలం టీ. కొత్తపల్లి గ్రామ ఎంపీటీసీ-2 స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గాదోమ్మేటి వెంకట దుర్గా ప్రసాద్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొని ఆయనకు మద్దతు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగ రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సత్యనారాయణ (ఢిల్లీ నారాయణ), వడ్డీ గౌతమ్, పండు విజయకుమార్, పచ్చిమాల విజయ్ కుమార్, సూర్యనారాయణ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.


