Saturday, October 24, 2026
More
    HomeUncategorizedతాళ్లరేవులో అభివృద్ధి జాతర.. రూ.11.75 కోట్ల పనులకు శ్రీకారం! సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పుష్కర ఘాట్లు,...

    తాళ్లరేవులో అభివృద్ధి జాతర.. రూ.11.75 కోట్ల పనులకు శ్రీకారం! సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పుష్కర ఘాట్లు, తాగునీటి పథకాలకు పెద్దపీట

    📰 Generate e-Paper Clip

    తాళ్లరేవు, అక్టోబర్ 10 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి):

    డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్లరేవు మండలంలో అభివృద్ధి పనులకు ఊపందుకుంది. మండలంలోని పలు గ్రామాల్లో రూ.11.75 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) శనివారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు.

    గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా సీసీ రోడ్లు, రోడ్డు కం డ్రైనేజీలు, పుష్కర రోడ్లు, ఘాట్లు, తాగునీటి పథకాలు, కమ్యూనిటీ హాల్, అంగన్‌వాడీ కేంద్రం వంటి ప్రజోపయోగ పనులకు శ్రీకారం చుట్టారు.

    రూ.8.18 కోట్లతో సీసీ రోడ్లు

    పిల్లంక, ఇంజరం, పోలేకుర్రు, తాళ్లరేవు, కోరంగి, పటవల, చొల్లంగి గ్రామాల్లో రూ.8.18 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. అలాగే పిల్లంక, తాళ్లరేవు, గోపులంక, గోవులంక గ్రామాల్లో రూ.3.03 కోట్లతో చేపట్టనున్న పుష్కర రోడ్లు, ఘాట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

    నీలపల్లి గ్రామంలో రూ.39.78 లక్షలతో చేపట్టనున్న తాగునీటి పథకానికి శంకుస్థాపన చేయడంతో పాటు రేవువారిపేటలో మంచినీటి చెరువు ఆధునికీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభం

    ఇంజరంలో బీసీ కమ్యూనిటీ హాల్‌ను, అరటికాయలంకలో అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. తాళ్లరేవులో రోడ్డు కం డ్రైనేజీలు, సీసీ రోడ్ల పనులతో పాటు పుష్కర ఘాట్ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. కోరంగిలో అంబేద్కర్ విగ్రహం వద్ద సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను ప్రారంభించారు. పటవల, చొల్లంగి గ్రామాల్లోనూ పలు సీసీ రోడ్లను ప్రారంభించారు. చిన్న బొడ్డు వెంకటాయపాలెంలో హైస్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    గ్రామీణాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.

    పల్లె పండుగ 3.0 ద్వారా గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. చేపట్టిన పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు.

    నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

    ఈ కార్యక్రమాల్లో తాళ్లరేవు మండల పార్టీ అధ్యక్షుడు దూళిపూడి బాబి, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

    జీఎస్‌బీ వార్త — ప్రజల పక్షాన, నిజాన్ని నిర్భయంగా!

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Most Popular

    Recent Comments

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!