Friday, October 23, 2026
More
    HomeUncategorized*నేటి నుంచే కాకినాడలో సివైఎఫ్ "ఏకమ్ 5" ఆత్మీయ సంగీత మహోత్సవాలు*  ...

    *నేటి నుంచే కాకినాడలో సివైఎఫ్ “ఏకమ్ 5” ఆత్మీయ సంగీత మహోత్సవాలు*   *యువతరానికి దైవమార్గం, ఆత్మీయ వికాసమే ధ్యేయంగా మూడు రోజుల పాటు స్తుతి, ఆరాధనల సమర్పణ* 

    📰 Generate e-Paper Clip

    కాకినాడ సిటీ అక్టోబర్ 17 జి ఎస్ బి వార్త

    నేటి యువతను లోకపు ఆకర్షణల నుంచి తప్పించి, సత్య మార్గంలో నడిపించడంతో పాటు దైవిక విలువలు, ప్రభువు ప్రేమను వారి హృదయాల్లో నాటడమే లక్ష్యంగా ‘సివైఎఫ్ ఇంటర్నేషనల్’ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు “క్లిక్ అండ్ కమిట్”, “ఏకమ్ 5” ప్రత్యేక స్తుతి, ఆరాధన సంగీత మహోత్సవాలు ఆరంభం కానున్నాయి. కాకినాడ మెక్లారిన్ హైస్కూల్ మైదానంలో అక్టోబర్ 18, 19, 20 తేదీల్లో ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి పరలోకపు ఆశీర్వాదాలతో కూడిన ఈ ఆరాధన కూడికలు జరగనున్నాయి. ఈ వివరాలను సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ బి.హెచ్.వి. మూర్తి రాజు వెల్లడించారు.లోకపు వ్యామోహాలు, తాత్కాలిక భోగభాగ్యాల వైపు పరుగులు తీస్తూ ఆత్మీయ జీవితాన్ని విస్మరిస్తున్న యవ్వనస్థులను క్రీస్తు ప్రేమతో దర్శించి, సరియైన దైవిక మార్గంలో స్థిరపరచడమే ఈ మహోత్సవాల మూల సంకల్పమని డాక్టర్ మూర్తి రాజు పేర్కొన్నారు. కీర్తనలు, ఆత్మీయ సంగీతం, దైవవాక్య పరిచర్య, ప్రార్థనా పూర్వక కౌన్సెలింగ్ ద్వారా గత 29 సంవత్సరాలుగా యువతను దేవుని మహిమ కొరకు సిద్ధపరుస్తున్నట్లు తెలిపారు.ఈ మూడు రోజుల కూడికలలో భాగంగా నిర్వహించే ‘ఏకమ్ 5’ సంగీత ఆరాధన విశ్వాసులను పరలోక సన్నిధిలోకి నడిపించనుంది. దేవుని నామాన్ని ఘనపరిచేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 1,600 మందికి పైగా యవ్వనస్థులు ఇప్పటికే తమ పేర్లను నమోదు చేసుకుని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.ఈ మహోత్సవాల్లో ప్రముఖ దైవజనులు బ్రదర్ సామ్యుల్ దినకర్, బ్రదర్ అనిల్ కుమార్ పాల్గొని శక్తివంతమైన జీవవాక్యాన్ని ప్రకటించనున్నారు. యువత ఆత్మీయంగా బలపడటంతో పాటు ప్రతి కుటుంబంలో దైవిక శాంతి, స్వస్థత, సమాధానం కలగాలని ప్రత్యేక విజ్ఞాపన ప్రార్థనలు చేయనున్నారు.ఈ ఆత్మీయ విందులో పాల్గొని ప్రభువు కృపలను పొందుకోవడానికి ప్రవేశం ఉచితమని, కాకినాడ పరిసర ప్రాంతాల విశ్వాసులు, కుటుంబ సమేతంగా తరలివచ్చి దైవాశీర్వాదాలు పొందాలని ఆహ్వానించారు.ఈ మహోత్సవ ఏర్పాట్లలో సివైఎఫ్ నేషనల్ కోఆర్డినేటర్ రెవరెండ్ కలవల జాన్ విక్లీఫ్, స్టేట్ కోఆర్డినేటర్ జోయల్, జిల్లా కోఆర్డినేటర్ మాసా సుదీర్ సన్నీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కొత్తపల్లి సునీల్, మచ్చా బుజ్జి బాబు, పెయ్యల నాని బాబు, వారా వినోద్, చైతన్య, విజయ్ భాస్కర్, తెలుగు రవి, వల్లూరి నానాజీ తదితర సేవకులు, విశ్వాసులు ప్రార్థనాపూర్వకంగా సహకరిస్తున్నారు.

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Most Popular

    Recent Comments

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!