Thursday, October 22, 2026
More
    HomeUncategorizedపుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై దాడిని ఖండించిన కాశి రామకృష్ణ ప్రజాస్వామ్యంపై దాడి.....

    పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై దాడిని ఖండించిన కాశి రామకృష్ణ ప్రజాస్వామ్యంపై దాడి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

    📰 Generate e-Paper Clip

    ఐ.పోలవరం, అక్టోబర్ 16 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి):

    తిరుపతి జిల్లా పుంగనూరులో రాజంపేట ఎంపీ, వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై జరిగిన దాడిని వైఎస్సార్‌సీపీ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ ఖండించారు. ఈ ఘటన ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడిగా ఆయన అభివర్ణించారు.

    రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై దాడులు, బెదిరింపుల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేయాల్సిన రాజకీయ పార్టీలు భౌతిక దాడులకు పాల్పడటం సరికాదన్నారు.

    పుంగనూరులో జరిగిన ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులకు తగిన భద్రత కల్పించాలని, ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.

    దాడులు, బెదిరింపులతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను భయపెట్టలేరని కాశి రామకృష్ణ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

     

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Most Popular

    Recent Comments

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!