ప్రభుత్వ హాస్టళ్లపై ఆంక్షలు పాలనా వైఫల్యానికి నిదర్శనం: — వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ.

    Date:

    📰 Generate e-Paper Clip

     

    ముమ్మిడివరం ఆగస్ట్ 13( జియస్ బి వార్త) సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లోకి జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు మరియు హక్కుల నాయకులు వెళ్లకుండా ప్రభుత్వం ఆంక్షలు అత్యంత దారుణమని జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ పేర్కొన్నారు..
    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కరువయ్యాయని, నాణ్యత లేని ఆహారంతో పాటు సురక్షితమైన మంచినీళ్లు సైతం అందచేయకపోవడం పట్ల విద్యార్థులు తీవ్ర అవాంతరాలు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాఠశాలలో దళిత బడుగు బలహీన వర్గాల పేద వర్గాల పిల్లలు మాత్రమే చదువుతారని ఈ పాఠశాలలో ఆంక్షలు విధించడం ఆయా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించడమే.. దళిత పేద బడుగు వర్గాల విద్యార్థులను చదువుకు దూరంగా పెట్టడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది.. ప్రభుత్వం ఆహారంలో పురుగులు రావడం, తరచు ఫుడ్ పాయిజన్ కావడం.. కలుషిత నీటి వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురికావడం వంటి ఘటనలు నిత్యం వెలుగు చూస్తున్నాయని మండిపడ్డారు. తమ పాలనా వైఫల్యాలను, హాస్టళ్లలోని దారుణ పరిస్థితులను కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం ఈ రకమైన నిర్బంధ ఆంక్షలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నాల్గవ స్తంభమైన మీడియాను, ప్రజా సమస్యలపై పోరాడే నాయకులను హాస్టళ్లలోకి రాకుండా అడ్డుకోవడం పత్రికా స్వేచ్ఛను సమాచార హక్కును కాలరాయడమేనని ధ్వజమెత్తారు.
    విద్యార్థుల భద్రత, వ్యక్తిగత గోప్యత పేరు చెప్పి ప్రభుత్వం తమ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తోందని దుయ్యబట్టారు. విద్యార్థుల భద్రతపై నిజమైన పట్టింపు ఉంటే హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు పెంచి, పరిశుభ్రమైన ఆహారం అందించాలి గానీ, నిజాలను వెలికితీసే వారిపై ఆంక్షలు విధించడం అత్యంత శోచనీయమన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లపై విధించిన ఈ నిబంధనలను, ఆంక్షలను ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించి, విద్యార్థుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించకపోతే ఊరుకునేది లేదు అని దారుణమని వైఎస్ ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    గొల్లపాలెం సహకార బ్యాంకు లో ఏటీఎం పగలుగొట్టి నగదు చోరీ  సీఐ కృష్ణ చైతన్య పరిశీలన

    గొల్లపాలెం సహకార బ్యాంకు లో ఏటీఎం పగలుగొట్టి నగదు చోరీ సీఐ కృష్ణ...

    ఐ.పోలవరం మండలం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎస్. అమీన్

    భీమ్‌నగర్‌లో ఘన సన్మానం.. అభినందించిన గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఐ.పోలవరం: సెప్టెంబర్...

    నూతన ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

    ఐ.పోలవరం సెప్టెంబర్ 07(జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!