ఐ.పోలవరం, అక్టోబర్ 10 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి):
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ పార్లమెంట్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన మాజీ సర్పంచ్ రాంబాల బాల రమేష్, డాక్టర్ ప్రసాద్, మెండా శివ, గోదాసి పుండరీష్‌లకు మండల జనసేన పార్టీ సీనియర్ నాయకులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి సమన్వయం, ఐక్యత, క్షేత్రస్థాయి కార్యాచరణ కీలకమని పేర్కొన్నారు. కమిటీ సభ్యులుగా ఎంపికైన నాయకులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని ఎన్నికల వ్యూహాలను పటిష్టంగా అమలు చేయాలని ఆకాంక్షించారు.
పవన్ కల్యాణ్ ఆశయాలే లక్ష్యంగా.. జనసేన బలోపేతమే ధ్యేయంగా!
జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు, అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.
పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, యువతను, ప్రజలను మరింతగా పార్టీకి చేరువ చేయడంలో కమిటీ సభ్యులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ విజయానికి ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్సవటపల్లి నారాయణస్వామి, నంద్యాల శివాజీ, త్సవటపల్లి మణికంఠ, అడపా సాయి, మెగా పవర్ యూత్ కన్వీనర్ కాయల బలరాం, బసవ మురళి తదితరులు పాల్గొని నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి నాయకత్వంలో జనసేన పార్టీ మరింత అభివృద్ధి సాధించి, రాబోయే ఎన్నికల్లో విజయపథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

