హత్య కేసు ఛేదించిన త్రీ టౌన్ పోలీసులు
ముగ్గురు నిందితులు అరెస్ట్
సి ఐ కె వీ ఎస్. సత్యనారాయణ ను అభినందించిన ఎస్పీ బిందు మాధవ్
కాకినాడ, (జిఎస్ బి వార్త )
జూలై 10
నగరం లో మొజ్జు సతీశ్ హత్య కేసు ను త్రీ టౌన్ పోలీసులు చేధించారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు ను జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) మహంతి కిషోర్ కుమార్, సీ ఐ కె వి ఎస్ . సత్యనారాయణ లు వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది మే 10 న మొజ్జు సతీశ్ మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడి ఉన్నట్లు సమాచారం రావడంతో కేసు నమోదు చేశామని తెలిపారు. దర్యాప్తు లో భాగంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా హత్య కేసు గా నమోదు చేసి దర్యాప్తు కొనసాగించడం జరిగిందని పేర్కొన్నారు. ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలు తో కేసు పై ప్రత్యేక దృష్టి పెట్టి అదనపు ఎస్పీ మహంతి కిషోర్ కుమార్ పర్యవేక్షణలో ప్రత్యేక క్రైమ్ బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు నిర్వహించామని చెప్పారు. దర్యాప్తు లో భాగంగా శుక్రవారం కుంచె ప్రభు తేజ, కుంచె నాని, పెరుగు అంజలి అలియాస్ రాణి లను అరెస్ట్ చేశామని చెప్పారు. వారి వద్ద నుంచి నేరానికి ఉపయోగించి న ద్విచక్ర వాహనం, మసాలా దాంచే కర్ర, ప్లాస్టిక్ గొట్టం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నిందితుడు ప్రభు తేజ వద్ద మృతుడు సతీష్ హెల్పేర్ గా పనిచేసే వాడని అన్నారు. నిందితుడు ప్రభు తేజ కాకినాడ కుర్రోడు పేరుతో వీడియోలు తీసేవాడని తెలిపారు. మృతి చెందిన సతీష్ ప్రభు తేజ ఇంట్లో 30,000 రూపాయల నగదు, మూడు సెల్ ఫోన్లు దొంగిలించాడని, అవి తిరిగి ఇవ్వకపోవడం తో పాటు దూషించడం వల్ల హత్య చేయాలని పథకం రూపొందించారని దర్యాప్తు లో తేలిందని చెప్పారు. మే 9 తేదీ న మృతుడిని తీవ్రంగా కొట్టి గొంతు నులిమి హత్య చేశారని చెప్పారు. అనంతరం మృత దేహాన్ని సీ సీ కెమెరాలు లేని మార్గం ద్వారా ద్విచక్ర వాహనం పై తీసుకు వచ్చి సాంబమూర్తి నగర రెండవ వీధిలో చెట్టు కింద పడేశారని వివరించారు. కేసు ను త్వరితగతిన ఛేదించిన త్రీ టౌన్ సి ఐ కె వి ఎస్. సత్యనారాయణ, ఎస్ ఐ సత్యనారాయణ చౌదరి, ఎ ఎస్ ఐ శ్రీనివాసు, హెడ్ కానిస్టేబుల్ సతీష్, కానిస్టేబుల్ మురళీ రాజు లను, క్రైమ్ పోలీస్ సిబ్బంది నీ ఎస్పీ బిందు మాధవ్ తో పాటు జిల్లా ఉన్నతాధికారులు అభినందించారు.
