13వ డివిజన్‌లో ₹15 లక్షల KUDA నిధులతో డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకారం

    Date:

    📰 Generate e-Paper Clip

    13వ డివిజన్‌లో ₹15 లక్షల KUDA నిధులతో డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకార

    కాకినాడ సిటీ ఆగస్టు 7 జి ఎస్ బి వార్త

    కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 13వ డివిజన్ రెవెన్యూ కాలనీ, సంజయ్ నగర్ తదితర ప్రాంతాలలో రూ.15 లక్షల ‘కుడా’ (KUDA) నిధులతో చేపడుతున్న డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణ పనులకు శుక్రవారం కొబ్బరికాయ కొట్టి అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం చేశారు. కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు సూచనల మేరకు ఈ సంక్షేమ పనులను శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్, మాజీ కార్పొరేటర్ వమ్మి బాలాజీ తెలిపారు.ఈ సందర్భంగా వమ్మి బాలాజీ మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డివిజన్‌లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. గతంలో తాను కార్పొరేటర్‌గా ఉన్న సమయంలోనూ ఎమ్మెల్యే కొండబాబు చొరవతో స్మార్ట్ సిటీ నిధుల నుంచి సుమారు ₹8 కోట్ల విలువైన అభివృద్ధి పనులను డివిజన్ ప్రజలకు అందించిన ఘనత వారికి దక్కుతుందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం డీఈ (DE) ప్రవీణ్ చంద్ర, సచివాలయ అధికారులు, కూటమి నాయకులు జొన్న వెంకన్న బాబు, ఎస్.కే. భాషా, కలగా సువర్ణ, పరిమి వీరభద్ర, వి. చౌదరి, సిరిశెట్టి రామారావు, ఆకేటి గోవిందరావు, నాని, ఈశ్వరరావులతో పాటు ఇతర పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు.

    Previous article
    ఆంధ్రప్రదేశ్ లో. IAS అధికారుల బదిలీలు నియామకాలు… IAS అధికారుల బదిలీలు, పోస్టింగ్స్‌ పై ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఎస్ ఎస్. రావత్ – పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ. జె. శ్యామలరావు – పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ. కోనా శశిధర్ – రవాణా, రోడ్లు–భవనాల శాఖ కార్యదర్శిగా నియామకం. ఎం. శివ ప్రసాద్, IFS – ఏపీఎస్‌ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ. అమ్రపాలి కాటా – ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి రిలీవ్; తదుపరి పోస్టింగ్ కోసం GADకు రిపోర్ట్ చేయాలని ఆదేశం. పట్టంశెట్టి రవి సుభాష్ – ఏపీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియామకం; APPSCలో CEO, సెక్రటరీ పోస్టులకు FAC బాధ్యతలు. సురేష్ కుమార్ – గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా నియామకం. నారాయణ భరత్ గుప్తా – గోదావరి పుష్కరాల జాయింట్ స్పెషల్ ఆఫీసర్‌గా నియామకం. ముత్యాలరాజు రేవు – పురావస్తు, మ్యూజియంల కమిషనర్‌గా బదిలీ. కె.వి.ఎన్. చక్రధర బాబు – ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్, నేషనల్ హెల్త్ మిషన్ ఎండీగా FAC బాధ్యతలు. హెప్సిబా రాణి కొర్లపాటి – హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియామకం; ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా FAC. పి. అరుణ్ బాబు – డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్‌గా నియామకం. ఎన్. తేజ్ భరత్ – విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ బాధ్యతల నుంచి రిలీవ్. ప్రఖర్ జైన్ – విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్‌గా నియామకం. గీతాంజలి శర్మ – ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ ఎండీగా FAC బాధ్యతలు. చేతన్ టి.ఎస్. – డైరెక్టర్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌గా FAC బాధ్యతలు. డా. ఎ. శరత్ (రిటైర్డ్ IAS) – తిరుమల తిరుపతి దేవస్థానాల **జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (హెల్త్ & ఎడ్యుకేషన్)**గా కొనసాగింపు. ప్రభల గోపీనాథ్ – టీటీడీ **జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (హెల్త్ & ఎడ్యుకేషన్)**గా నియామకం. ఎ.ఎ.ఎల్. పద్మావతి – ఎన్‌టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా FAC బాధ్యతలు. ఎం. జయకృష్ణ – తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియామకం. బి. అనిల్ కుమార్ రెడ్డి – ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ బాధ్యతల నుంచి రిలీవ్. బి. సునీల్ కుమార్ రెడ్డి, IFS – ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా FAC బాధ్యతలు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు కొత్త కమిషనర్‌గా ఎం. జయకృష్ణ IAS. టీటీడీలో హెల్త్ & ఎడ్యుకేషన్ విభాగానికి జాయింట్ ఈవోగా డా. ఎ. శరత్ కొనసాగింపు. ప్రభల గోపీనాథ్‌కు టీటీడీ జేఈవో (హెల్త్ & ఎడ్యుకేషన్) బాధ్యతలు. ఎన్‌టీఆర్ వైద్య సేవా ట్రస్ట్‌కు ఎ.ఎ.ఎల్. పద్మావతికి FAC బాధ్యతలు.
    Next article

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    గొల్లపాలెం సహకార బ్యాంకు లో ఏటీఎం పగలుగొట్టి నగదు చోరీ  సీఐ కృష్ణ చైతన్య పరిశీలన

    గొల్లపాలెం సహకార బ్యాంకు లో ఏటీఎం పగలుగొట్టి నగదు చోరీ సీఐ కృష్ణ...

    ఐ.పోలవరం మండలం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎస్. అమీన్

    భీమ్‌నగర్‌లో ఘన సన్మానం.. అభినందించిన గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఐ.పోలవరం: సెప్టెంబర్...

    నూతన ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

    ఐ.పోలవరం సెప్టెంబర్ 07(జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!