13వ డివిజన్లో ₹15 లక్షల KUDA నిధులతో డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకార
కాకినాడ సిటీ ఆగస్టు 7 జి ఎస్ బి వార్త
కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 13వ డివిజన్ రెవెన్యూ కాలనీ, సంజయ్ నగర్ తదితర ప్రాంతాలలో రూ.15 లక్షల ‘కుడా’ (KUDA) నిధులతో చేపడుతున్న డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణ పనులకు శుక్రవారం కొబ్బరికాయ కొట్టి అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం చేశారు. కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు సూచనల మేరకు ఈ సంక్షేమ పనులను శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్, మాజీ కార్పొరేటర్ వమ్మి బాలాజీ తెలిపారు.ఈ సందర్భంగా వమ్మి బాలాజీ మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డివిజన్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. గతంలో తాను కార్పొరేటర్‌గా ఉన్న సమయంలోనూ ఎమ్మెల్యే కొండబాబు చొరవతో స్మార్ట్ సిటీ నిధుల నుంచి సుమారు ₹8 కోట్ల విలువైన అభివృద్ధి పనులను డివిజన్ ప్రజలకు అందించిన ఘనత వారికి దక్కుతుందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం డీఈ (DE) ప్రవీణ్ చంద్ర, సచివాలయ అధికారులు, కూటమి నాయకులు జొన్న వెంకన్న బాబు, ఎస్.కే. భాషా, కలగా సువర్ణ, పరిమి వీరభద్ర, వి. చౌదరి, సిరిశెట్టి రామారావు, ఆకేటి గోవిందరావు, నాని, ఈశ్వరరావులతో పాటు ఇతర పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు.
