మెగా డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది — టిడిపి మండల అధ్యక్షుడు సాగిరాజు సూరిబాబు రాజు

    Date:

    📰 Generate e-Paper Clip

    ఐ. పోలవరం ఆగస్ట్ 12( జియస్ బి వార్త) ఐ.పోలవరం మండల టీడీపీ సమావేశం

    ఐ.పోలవరం మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి నెల రెండవ బుధవారం నిర్వహించే మండల పార్టీ సమావేశం ఈరోజు మురమళ్లలోని శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబు అధ్యక్షతన జరిగింది.

    ఈ సమావేశానికి మండలంలోని వివిధ గ్రామాల గ్రామ పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, క్లస్టర్ ఇన్‌చార్జిలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం” కార్యక్రమాన్ని ఐ.పోలవరం మండల పరిధిలో విజయవంతంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇప్పటికే మండలంలో కొంతమేర ఇంటింటి సర్వే పూర్తయిందని, మిగిలిన ఇళ్లను కూడా వేగవంతంగా సందర్శించి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ప్రజలకు అందించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని సూచించారు. ముమ్మిడివరం నియోజకవర్గాన్ని ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేలా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని కోరారు.

    అదేవిధంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. మెగా డీఎస్సీ ద్వారా సుమారు 16 వేల మందికి పైగా నిరుద్యోగ యువతకు ఉపాధ్యాయులుగా ఉద్యోగావకాశాలు కల్పించడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి దక్కిన ఘనత అని పేర్కొన్నారు. నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహిస్తూ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు.

    సమావేశంలో మండలంలోని గ్రామాల వారీగా పార్టీ కార్యక్రమాల అమలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకుల నుంచి వివిధ సలహాలు, సూచనలను స్వీకరించారు. వాటిని తీర్మానాల రూపంలో నమోదు చేసి కేంద్ర పార్టీ నాయకత్వం దృష్టికి పంపాలని నిర్ణయించారు.

    కార్యకర్తలు ఐక్యంగా, సమన్వయంతో పనిచేస్తూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    ఐ.పోలవరం మండలం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎస్. అమీన్

    భీమ్‌నగర్‌లో ఘన సన్మానం.. అభినందించిన గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఐ.పోలవరం: సెప్టెంబర్...

    నూతన ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

    ఐ.పోలవరం సెప్టెంబర్ 07(జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

    పసిపిల్లల గాయాలకు డిటర్జెంట్ సబ్బా?

      అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్కకాటు చికిత్సపై విచారణ జరపాలి వైద్య నిర్లక్ష్యాన్ని సమర్థించుకునేందుకు...
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!