ఘనంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు – కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన జనసేన మండల వైస్ ప్రెసిడెంట్ సవరపు వెంకట్

    Date:

    📰 Generate e-Paper Clip

    ఐ.పోలవరంలో సందడిగా పుట్టినరోజు సంబరాలు.. పవన్ కళ్యాణ్‌కు ఘన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు

    ఐ.పోలవరం, సెప్టెంబర్ 02 (జియస్‌బి వార్త రిపోర్టర్ వేణు కాశి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఐ.పోలవరం మండలంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఐ.పోలవరం మండల జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ సవరపు వెంకట్ మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

    ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్‌కు భగవంతుడు నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలు, ఆనందం, సుఖసంతోషాలు ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు.

    పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందాలని, ఆయన ఆశయాలు మరింత విజయవంతం కావాలని సవరపు వెంకట్ పేర్కొన్నారు.

    పవర్ స్టార్‌గా సినీ రంగంలో కోట్లాది అభిమానులను సంపాదించుకుని, ప్రజాసేవకుడిగా రాజకీయ రంగంలో ప్రజల కోసం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ మరెన్నో విజయాలు సాధించాలని ఈ సందర్భంగా జనసేన నాయకులు ఆకాంక్షించారు.

    ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొని తమ అభిమాన నాయకుడికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం మొత్తం సందడిగా, ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!