కె. గంగవరం, జీఎస్‌బీ వార్త:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని కె. గంగవరం మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థిత్వంపై రాజకీయ చర్చలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కొండేపూడి చంటిబాబు పేరు జెడ్పీటీసీ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది.
మండలంలోని వివిధ సామాజిక వర్గాలతో ఆయనకు పరిచయాలు, సంబంధాలు ఉన్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గంలో ఆయనకు మంచి పరిచయాలు, ఆదరణ ఉన్నట్లు ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ స్థానికంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారని వారు చెబుతున్నారు.
జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థిత్వంపై చర్చలు ఊపందుకోవడంతో కొండేపూడి చంటిబాబు పేరు ప్రస్తావనకు వస్తోంది. మండల రాజకీయాల్లో చోటుచేసుకునే పరిణామాలు, పార్టీ నాయకత్వం తీసుకునే నిర్ణయాలు, అభ్యర్థుల ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కె. గంగవరం మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థిత్వం ఖరారయ్యే నాటికి రాజకీయ సమీకరణాలు మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది.

